News March 18, 2024
త్వరలో ‘ఇష్క్’ కాంబో రిపీట్!

హీరో నితిన్, డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో త్వరలో మరో సినిమా రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘ఇష్క్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నితిన్ ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. విక్రమ్ ‘దూత’ వెబ్ సిరీస్‌తో గత ఏడాది మరో హిట్ అందుకున్నారు.
Similar News
News February 14, 2026
2026-27 బడ్జెట్: వ్యవసాయం, నీరు పారుదలకు కేటాయింపులు

AP: అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.6,600 కోట్లను కేటాయించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.1,927 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు, పంటల బీమాకు రూ.250 కోట్లు, PM కృషి సించాయీ యోజనకు రూ.190 కోట్లు, మత్స్యకార సేవలో కోసం రూ.260 కోట్లు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.9,906 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.6,105 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
News February 14, 2026
అప్పు తీర్చడానికి మళ్లీ అప్పు: పయ్యావుల

AP: పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వంలో రాష్ట్రం ₹9.74లక్షల కోట్ల అప్పుతో ఆర్థికంగా విధ్వంసమైంది. మేము చేస్తున్న అప్పు ఉత్పాదకతకు ఖర్చు చేస్తున్నాం. ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా బయటపడలేదు. పరిస్థితులు సానుకూలంగా లేవు. అనేక సవాళ్లు ఉన్నా అభివృద్ధి సంక్షేమంపై మా లక్ష్యాల్లో మార్పు లేదు’ అని వివరించారు.
News February 14, 2026
దివ్యాంగులకు ఫ్రీ బస్సు.. బడ్జెట్‌లో ప్రస్తావన

AP: రాష్ట్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ‘ఇంద్రధనుస్సు’ పేరుతో అమలు చేయనున్నట్లు బడ్జెట్ ప్రతుల్లో పేర్కొంది. కాగా ప్రస్తుతం దివ్యాంగులు 50% టికెట్ సబ్సిడీతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో వెల్లడించలేదు.


