News January 23, 2025

దశాబ్దాల తర్వాత బంగ్లాకు ISI చీఫ్.. టార్గెట్ భారత్!

image

ISI చీఫ్ LT GEN ఆసిమ్ మాలిక్ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత పాక్ ఇంటెలిజెన్స్ చీఫ్ అక్కడికి రావడం గమనార్హం. మంగళవారం దుబాయ్ నుంచి ఢాకా చేరుకున్న ఆయన్ను బంగ్లా ఆర్మీ QMG LT GEN మహ్మద్ ఫైజుర్ రెహ్మాన్ రిసీవ్ చేసుకున్నారు. రెహ్మాన్‌కు పాకిస్థాన్, ఇస్లామిస్టులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం. తూర్పు సరిహద్దు వద్ద భారత్‌ను ఇబ్బంది పెట్టడమే ఈ మీటింగ్ ఉద్దేశంగా తెలుస్తోంది.

Similar News

News January 23, 2025

రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని భారీ ఒప్పందాలు

image

TG: దావోస్ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని భారీ ఒప్పందాలు చేసుకుంది. టిల్మాన్ ప్రెసిడెంట్ అహుజాతో CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధికి అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్‌తో రూ.15వేల కోట్ల ఎంవోయూ చేసుకుంది. మరోవైపు ఉర్సా క్లస్టర్స్‌తో రూ.5 వేల కోట్ల పెట్టుబడికి అంగీకారం చేసుకుంది. HYDలో ఈ సంస్థ AI డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.

News January 23, 2025

IPL: KKRకు బిగ్ షాక్?

image

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ఎంపీ తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతూ ఆ జట్టు ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డారు. కేరళతో జరిగిన మ్యాచులో ఆయన కాలిమడమకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకునేందుకు సమయం పట్టొచ్చు. కాగా IPL మెగా వేలంలో రూ.23.75 కోట్లు వెచ్చించి వెంకటేశ్‌ను KKR కొనుగోలు చేసింది. ఈ సీజన్‌కు ఆయనను కెప్టెన్‌గా కూడా నియమిస్తారని వార్తలు వచ్చాయి.

News January 23, 2025

పవన్‌తో సెల్ఫీ తీసుకున్న సింగపూర్ హైకమిషనర్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీ దిగి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు. సింగపూర్- ఆంధ్రప్రదేశ్ చిరకాల స్నేహాన్ని కలిగి ఉన్నాయి. AP-SG సహకారాన్ని బలోపేతం చేయడంపై జరిగిన చర్చను అభినందించాల్సిందే’ అని ట్వీట్ చేశారు.