News January 23, 2025
దశాబ్దాల తర్వాత బంగ్లాకు ISI చీఫ్.. టార్గెట్ భారత్!

ISI చీఫ్ LT GEN ఆసిమ్ మాలిక్ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత పాక్ ఇంటెలిజెన్స్ చీఫ్ అక్కడికి రావడం గమనార్హం. మంగళవారం దుబాయ్ నుంచి ఢాకా చేరుకున్న ఆయన్ను బంగ్లా ఆర్మీ QMG LT GEN మహ్మద్ ఫైజుర్ రెహ్మాన్ రిసీవ్ చేసుకున్నారు. రెహ్మాన్‌కు పాకిస్థాన్, ఇస్లామిస్టులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం. తూర్పు సరిహద్దు వద్ద భారత్‌ను ఇబ్బంది పెట్టడమే ఈ మీటింగ్ ఉద్దేశంగా తెలుస్తోంది.
Similar News
News February 9, 2025
నేడే రెండో వన్డే.. జట్టులో ఎన్ని మార్పులు?

IND, ENG మధ్య కటక్ వేదికగా ఇవాళ మ.1:30 నుంచి రెండో వన్డే జరగనుంది. కోహ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో జైస్వాల్‌ను తప్పిస్తారా? రోహిత్ ఫామ్‌లోకి వస్తాడా? వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కుతుందా? అతడి కోసం కుల్దీప్‌ను పక్కన పెడతారా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎలాగైనా గెలవాలని ENG కసిగా ఉంది. sports 18-2, hotstarలో లైవ్ చూడవచ్చు. WAY2NEWS లైవ్ స్కోర్ అప్‌డేట్స్ పొందవచ్చు.
News February 9, 2025
సీట్ల తేడా ఎక్కువున్నా ఓట్ల వ్యత్యాసం తక్కువే!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP, AAP మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువే ఉంది. BJPకి 45.56% పోలవగా ఆప్‌కు 43.57% వచ్చాయి. కానీ సీట్ల తేడా మాత్రం 26 స్థానాలుగా ఉంది. కాషాయ పార్టీ 48 స్థానాలను గెలుచుకోగా ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. అత్యధిక మెజార్టీతో గెలిచిన తొలి ముగ్గురు అభ్యర్థులూ ‘చీపురు’ పార్టీకి చెందినవారే కాగా అత్యల్ప మెజార్టీతో విజయం సాధించిన చివరి ముగ్గురూ కమలం అభ్యర్థులే కావడం గమనార్హం.
News February 9, 2025
రోహిత్ ఫామ్‌పై ఆందోళన లేదు: బ్యాటింగ్ కోచ్

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించి తమకు ఆందోళన లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. ‘రోహిత్‌కు వన్డేల్లో 31 సెంచరీలున్నాయి. గత వన్డే సిరీస్‌లో(vsSL) 56, 64, 35 పరుగులు చేశాడు. టెస్టుల్లో విఫలమయ్యాడు కానీ వన్డేల్లో రన్స్ చేస్తూనే ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌తో మాకు ఏ సమస్యా లేదు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.