News November 26, 2024

బంగ్లాలో ‘ఇస్కాన్’ నిర్వాహకుడు కృష్ణదాస్ ప్రభు అరెస్ట్

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న వేళ ఇస్కాన్ ఆలయ నిర్వాహకుడు శ్రీచిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఢాకా ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు డిటెక్టివ్ బ్రాంచ్ ఆఫీస్‌కి తరలించారు. అయితే ఈ విషయాన్ని మహ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా బంగ్లాలో హిందువులపై దాడులపై కృష్ణదాస్ పోరాడుతున్నారు.

Similar News

News December 3, 2025

కాలి వేళ్ల వెంట్రుకలు రాలిపోతున్నాయా?

image

కాలి వేళ్లపై ఉండే వెంట్రుకలు శరీర రక్త ప్రసరణ, జీవక్రియ ఆరోగ్యాన్ని పరోక్షంగా సూచిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘వేగంగా వెంట్రుకలు పెరిగితే రక్తప్రసరణ బాగుందని అర్థం. రక్త ప్రసరణ తగ్గినప్పుడు వెంట్రుకలు రాలిపోతాయి. దీర్ఘకాలిక మధుమేహం లేదా PAD వంటి సమస్యల తొలిదశలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. దీనిని వ్యాధి నిర్ధారణకు ముందు శారీరక సూచనగా పరిగణించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News December 3, 2025

వదల ‘బొమ్మా’ళి.. మళ్లీ కస్టడీ పిటిషన్

image

TG: ఐబొమ్మ రవి కేసులో మరో 4 కేసుల్లో కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఒక్కో కేసులో 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని రవి న్యాయవాదిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఒకే కేసులో రవిని పోలీసులు రెండుసార్లు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అటు కస్టడీ పూర్తి కావడంతో రవి బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

News December 3, 2025

‘కాటన్ ష్రెడర్’తో పత్తి వ్యర్థాల సద్వినియోగం

image

పత్తి పంటలో వ్యర్థాల తొలగింపునకు కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘కాటన్ ష్రెడర్’ యంత్రం అందుబాటులో ఉంది. ఇది పత్తి మొక్క కాండాన్ని కత్తిరించి చిన్న ముక్కలుగా చేస్తుంది. ఈ ష్రెడర్ సాయంతో 3 గంటల్లో 1 హెక్టార్ భూమిలో పత్తి పంట వ్యర్థాలను తొలగించి ముక్కలుగా చేసి భూమిలో కలిపివేయవచ్చు లేదా పారిశ్రామిక అవసరాలకు వాడవచ్చు. పత్తి మొక్క కాండాలను భూమిలో కలపడం వల్ల భూసారం పెరుగుతుంది.