News November 26, 2024
బంగ్లాలో ‘ఇస్కాన్’ నిర్వాహకుడు కృష్ణదాస్ ప్రభు అరెస్ట్
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న వేళ ఇస్కాన్ ఆలయ నిర్వాహకుడు శ్రీచిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఢాకా ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు డిటెక్టివ్ బ్రాంచ్ ఆఫీస్‌కి తరలించారు. అయితే ఈ విషయాన్ని మహ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా బంగ్లాలో హిందువులపై దాడులపై కృష్ణదాస్ పోరాడుతున్నారు.
Similar News
News December 5, 2024
నేడు విచారణకు రానున్న హరీశ్ రావు క్వాష్ పిటిషన్
TG: పంజాగుట్ట పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి హరీశ్ రావు వేసిన క్వాష్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన అందులో పేర్కొన్నారు. కాగా ఎన్నికల సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను హరీశ్ రావు ట్యాప్ చేశారని సిద్దిపేటలో ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు.
News December 5, 2024
ఏపీలోనూ ఒక పాకిస్థాన్ ఉందని తెలుసా?
AP: రాష్ట్రంలోని విజయవాడలో పాకిస్థాన్ పేరుతో ఓ కాలనీ ఉంది. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. అదే సమయంలో పాక్, బంగ్లాదేశ్ విడిపోవడంతో ఇరు దేశాల సరిహద్దుల్లోని అనేక కుటుంబాలు నిరాశ్రయులు కావడంతో అప్పటి ప్రధాని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారికి ఆశ్రయం కల్పించారు. 1984లో నగరంలోని పాయకాపురం ప్రాంతంలో 40 ఇళ్లతో ఓ కాలనీ ఏర్పాటైంది. దానికి పాకిస్థాన్ కాలనీగా నామకరణం చేశారు.
News December 5, 2024
BCCI కార్యదర్శి రేసులో ఉన్నది వీరేనా?
ICC ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు తీసుకోవడంతో BCCI కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఈ పదవి ఎవరికి దక్కుతుందనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ పోస్టు కోసం కొందరు పోటీలో ఉన్నారు. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్, BCCI సంయుక్త కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ, BCCI కోశాధికారి ఆశిష్ షెలార్ రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరిని ఆ పదవి వరిస్తుందో చూడాలి.