News December 3, 2024

హిందూసాధువు లాయర్‌పై ఇస్లామిస్టుల మూకదాడి

image

బంగ్లాదేశ్‌లో మరో అరాచక ఘటన చోటు చేసుకుంది. హిందూ సాధువు చిన్మయ్ కృష్ణ‌దాస్ లాయర్ రామెన్ రాయ్‌పై మూకదాడి జరిగింది. ‘అడ్వకేట్ రామెన్ కోసం ప్రార్థించండి. అతడు చేసిన తప్పల్లా చిన్మయ్ కోసం కోర్టులో న్యాయపోరాటం చేయడమే. ఇస్లామిస్టులు అతడి ఇంటిని ముట్టడించి దాడి చేశారు. ప్రస్తుతం ఆయన ICUలో పోరాడుతున్నారు. #SaveBangladeshiHindus’ అని ఇస్కాన్ కోల్‌కతా అధికార ప్రతినిధి రాధారమణ్ దాస్ ట్వీట్ చేశారు.

Similar News

News March 24, 2026

IPLకు ముందు సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన గిల్

image

IPLకు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నారు. తనలోని ప్రశాంతతకు తనపై తనకు ఉన్న నమ్మకం, జట్టు ఇచ్చే భరోసాయే కారణమని తెలిపారు. సోమవారం జరిగిన ‘శుభారంభ్ 2026’ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. ప్రశాంతంగా ఉండటం వల్ల పరిస్థితులను స్పష్టంగా అంచనా వేయొచ్చని, అది లాంగ్ టర్మ్ విజన్ ఇస్తుందని చెప్పారు. కోచ్ ఆశిష్ నెహ్రా కూడా తమ లక్ష్యం గెలవడమేనని స్పష్టం చేశారు.

News March 24, 2026

యుద్ధం.. అమెరికాతో జైశంకర్ చర్చలు

image

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియోతో విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపై చర్చించారు. ముఖ్యంగా హార్ముజ్ వివాదం నేపథ్యంలో ఇంధన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ఐదు రోజులు వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2 దేశాలు నిరంతరం టచ్‌లో ఉండాలని నిర్ణయించాయి.

News March 24, 2026

ట్రంప్ ప్రకటనతో దిగొచ్చిన చమురు ధరలు

image

ఇరాన్‌పై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో యుద్ధ భయాలు తగ్గాయి. దీంతో చమురు ధరలు 13% మేర దిగొచ్చి $95 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సోమవారం ఉదయం భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు సాయంత్రానికి మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ₹1.46 లక్షల వరకు చేరింది. ఈ సానుకూల పవనాలతో మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.