News December 3, 2024
హిందూసాధువు లాయర్‌పై ఇస్లామిస్టుల మూకదాడి

బంగ్లాదేశ్‌లో మరో అరాచక ఘటన చోటు చేసుకుంది. హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ లాయర్ రామెన్ రాయ్‌పై మూకదాడి జరిగింది. ‘అడ్వకేట్ రామెన్ కోసం ప్రార్థించండి. అతడు చేసిన తప్పల్లా చిన్మయ్ కోసం కోర్టులో న్యాయపోరాటం చేయడమే. ఇస్లామిస్టులు అతడి ఇంటిని ముట్టడించి దాడి చేశారు. ప్రస్తుతం ఆయన ICUలో పోరాడుతున్నారు. #SaveBangladeshiHindus’ అని ఇస్కాన్ కోల్‌కతా అధికార ప్రతినిధి రాధారమణ్ దాస్ ట్వీట్ చేశారు.
Similar News
News January 16, 2026
NTPCలో ఉద్యోగాలు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 16, 2026
కనుమ రోజు మినుము ఎందుకు తినాలి?

కనుమ పశువులకు, పితృదేవతలకు అంకితం చేసిన పండుగ. ఈరోజు చనిపోయిన పెద్దల కోసం పెట్టే ప్రసాదాల్లో గారెలు ప్రధానమైనవి. వీటిలో పోషకాల విలువలు ఎక్కువ. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, బలాన్ని అందించడంలో మినుములు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ‘కనుమ రోజు మినుము తినాలి’ అనే సామెత పుట్టింది. ఆ రోజు అల్లుళ్లు, బంధువులతో కలిసి మినుములతో చేసిన వంటకాలు తింటూ, విశ్రాంతిగా గడపడమే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు రహస్యం.
News January 16, 2026
పౌడర్ రాయడం వల్ల ఈ నష్టాలు

బిడ్డకు చెమటలు పడుతున్నప్పుడు పదే పదే పౌడర్ రాస్తే అది తేమను గ్రహించి చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. పౌడర్ వేయడం వల్ల పిల్లల్లో అలెర్జీలు, ఉబ్బసం, దగ్గు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శిశువు చర్మాన్ని పొడిగా, సౌకర్యవంతంగా ఉంచాలనుకుంటే చర్మంపై కొబ్బరి నూనె వాడాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల కోసం పౌడర్‌ను కొనేముందు వైద్యులు సూచించిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం మంచిది.


