News August 10, 2024

స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి..100మంది మృతి: గాజా

image

గాజాలోని ఓ స్కూల్‌పై క్షిపణి దాడి చేసి ఇజ్రాయెల్ 100మంది వరకు అమాయకుల్ని బలి తీసుకుందని గాజా పౌర రక్షణ సంస్థ ఆరోపించింది. మరెంతోమందిని క్షతగాత్రులుగా మార్చిందని పేర్కొంది. ఇది అత్యంత దారుణమైన నరమేధమని ఆందోళన వ్యక్తం చేసింది. మంటల్ని అదుపుచేసేందుకు తమ సిబ్బంది చెమటోడుస్తున్నారని తెలిపింది. అయితే, ఇజ్రాయెల్ ఆ ఆరోపణల్ని ఖండించింది. తాము కేవలం హమాస్ కమాండ్ కేంద్రంపైనే దాడి చేశామని వివరణ ఇచ్చింది.

Similar News

News September 13, 2025

భారత్‌‌పై సుంకాలు విధించాలని G7, EUకి US రిక్వెస్ట్!

image

రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్‌, చైనాపై సుంకాలు విధించాలని G7 దేశాలు, EUను US కోరినట్లు రాయిటర్స్ తెలిపింది. G7 ఫైనాన్స్ మినిస్టర్ల మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో దీనిపై చర్చ జరిగినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తేవాలని వారు చర్చించినట్లు తెలిపింది. ఫ్రీజ్ చేసిన రష్యా అసెట్స్‌ను వినియోగించుకుని, ఉక్రెయిన్ రక్షణకు నిధులు సమకూర్చేందుకూ అంగీకరించారని వెల్లడించింది.

News September 13, 2025

రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమనం!

image

నైరుతి రుతుపవనాల తిరోగమనం సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని IMD అంచనా వేసింది. జూన్ 1న కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించిన రుతుపవనాలు 8వ తేదీకల్లా అంతటికీ విస్తరించాయి. ఈ సీజన్‌లో 77.86CM వర్షం కురవాల్సి ఉండగా 83.62CM వర్షపాతం నమోదైంది. వాయవ్య భారతంలో సాధారణం(53.81CM) కంటే 34 శాతం, దక్షిణాదిన రెగ్యులర్(61CM) కంటే 7 శాతం అధిక వర్షపాతం నమోదైందని IMD వెల్లడించింది.

News September 13, 2025

ట్రెండింగ్.. బాయ్‌కాట్ ఆసియా కప్

image

ఆసియా కప్‌లో రేపు భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ‘బాయ్‌కాట్ ఆసియా కప్, బాయ్‌కాట్ INDvsPAK’ అనే హ్యాష్ ట్యాగ్‌లు Xలో ట్రెండ్ అవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిని తామింకా మరిచిపోలేదని, PAKతో క్రికెట్ ఆడొద్దని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచును BCCI బ్యాన్ చేయకపోయినా దేశ ప్రజలు బ్యాన్ చేయాలంటూ SMలో పోస్టులు పెడుతున్నారు. రేపు మీరు మ్యాచ్ చూస్తారా? కామెంట్ చేయండి.