News January 3, 2025

గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 54మంది మృతి

image

గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ మరోమారు వైమానిక దాడులతో విరుచుకుపడింది. పలు ప్రాంతాలపై చేసిన ఈ దాడుల్లో తమ పౌరులు కనీసం 54మంది మృతిచెందారని, అనేకమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని గాజా యంత్రాంగం ప్రకటించింది. అమాయకులైన పౌరులు తలదాచుకున్న శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడిందని మండిపడింది. కాగా.. మిలిటెంట్లే లక్ష్యంగా దాడులు నిర్వహించామని ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది.

Similar News

News January 5, 2025

వారంలో జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు

image

TG: రాష్ట్రంలో త్వరలో జూనియర్ లెక్చరర్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండేళ్ల కిందటే 1392 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. సెలక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను ఇంటర్ కమిషనరేట్‌కు అప్పగించింది. మల్టీజోన్‌-1లో 581 మంది, జోన్-2లో 558 మంది ఉన్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తికాగా వీరికి వారంలోగా నియామక పత్రాలు ఇచ్చి కాలేజీల్లో భర్తీ చేయనున్నారు.

News January 5, 2025

కాఫీ, టీ తాగేవారికి గుడ్ న్యూస్!

image

కాఫీ, టీ తాగేవారిలో ఇతరుల కంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపింది. రోజుకు 4కప్పుల కాఫీ తాగేవారిలో 17% క్యాన్సర్ కారకాలు తగ్గాయని చెప్పింది. నోటి క్యాన్సర్ లక్షణాలు 30%, గొంతు క్యాన్సర్ కారకాలు 22% తక్కువైనట్లు వివరించింది. అలాగే, రోజుకు ఒక్క కప్పైనా టీ తాగేవారిలో 9% తల, మెడ క్యాన్సర్ కారకాలు తక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే అదే పనిగా టీ తాగకూడదంది.

News January 5, 2025

శబరిమలకు పోటెత్తిన భక్తులు

image

శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. గడిచిన 24 గంటల్లో లక్ష మందికి పైగా దర్శనం చేసుకున్నట్లు దేవస్థానం తెలిపింది. రద్దీ పెరగడంతో అయ్యప్పస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్పాట్ దర్శనానికి 20 వేల టికెట్లను ట్రస్ట్ జారీ చేసింది. పంబ నుంచి సన్నిధానం వరకు అయ్యప్ప భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. త్వరలో శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఉండటంతో రానున్న రోజుల్లో భక్తుల తాకిడి పెరగనుంది.