News April 18, 2024
ఇజ్రాయెల్: చిన్న దేశానికి ఆయుధాలెక్కడివి?
గత OCT నుంచి హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. చిన్న దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్‌కు ప్రధాన సరఫరాదారైన అమెరికా ఏటా $3.8 బిలియన్ల సైనిక సాయం చేస్తోంది. జర్మనీ, ఇటలీ, బ్రిటన్ దేశాలు సైతం ఇజ్రాయెల్‌కు ఈ పరంగా సాయం చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్ సొంతంగా రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో 9వ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచింది.
Similar News
News September 15, 2024
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
TG: PMFBY కింద రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంటల బీమాను అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరు వరకు క్లస్టర్ల వారీగా టెండర్లను స్వీకరించనుంది. బీమా ప్రీమియంలో రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఇందుకోసం రూ.2,500కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది. దాదాపు అన్ని పంటలకు బీమాను వర్తింపజేయనున్నట్లు సమాచారం. అయితే ఏ సీజన్ (ఖరీఫ్ORరబీ) నుంచి అమలు చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.
News September 15, 2024
మా ఆర్థిక కష్టాలు తాత్కాలికమే: మాల్దీవులు
తమ ఆర్థిక కష్టాలు తాత్కాలికమేనని మాల్దీవుల ఆర్థిక మంత్రి మూసా జమీర్ తాజాగా పేర్కొన్నారు. చైనాకు దగ్గరయ్యాక ఆ దేశం అప్పుల ఊబిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) ప్యాకేజీకి మాల్దీవులు యత్నిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ అవసరాలకు, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే మిత్రదేశాలు తమకున్నాయని, IMF గురించి ఆలోచించడం లేదని మూసా స్పష్టం చేశారు.
News September 15, 2024
SHOCKING: అఫ్గానిస్థాన్‌లో క్రికెట్ నిషేధం?
అఫ్గానిస్థాన్‌లో క్రికెట్‌ను క్రమంగా నిషేధించాలని ఆ దేశ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. షరియా చట్టానికి క్రికెట్ హాని కలిగిస్తోందని తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. షరియాను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. బలమైన జట్టుగా ఎదుగుతున్న అఫ్గాన్‌కు ఇది శరాఘాతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.