News February 22, 2025

ఎల్లుండి నుంచి ఇస్రో ‘యువికా’ దరఖాస్తుల స్వీకరణ

image

ఇస్రో నిర్వహిస్తున్న యూత్ సైన్స్ ప్రోగ్రామ్ ‘యువికా’కు రిజిస్ట్రేషన్లు ఈ నెల 24 నుంచి మొదలుకానున్నాయి. వచ్చే నెల 23 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. 8వ తరగతి పూర్తైన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు. ఎంపికైన వారికి మే నెలలో 2వారాల పాటు స్పేస్ టెక్నాలజీ, సైన్స్‌లో శిక్షణనిస్తారు.

Similar News

News July 6, 2025

ప్రజాప్రతినిధుల సమాచారం సేకరిస్తున్న ప్రభుత్వం

image

TG: స్థానిక సంస్థల తాజా మాజీ ప్రజాప్రతినిధుల వివరాలను అందించాలని అన్ని జిల్లాల CEOలు, DPOలను ప్రభుత్వం ఆదేశించింది. వార్డు సభ్యుడు, సర్పంచి, MPTC, MPP, ZPTC, ZP ఛైర్మన్ల కులం, ఉపకులం, పార్టీ తదితర వివరాలను రేపటిలోగా సమర్పించాలని పేర్కొంది. గతేడాది చేపట్టిన సర్వే డేటాను విశ్లేషించడానికి ప్రభుత్వం ఓ స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి అవసరమైన సమాచారం కోసమే వివరాలను సేకరిస్తోంది.

News July 6, 2025

ఉపవాసంతో ఎన్ని లాభాలంటే?

image

పుణ్యం కోసం చేసినా, ఆరోగ్యం కోసం చేసినా ఉపవాసం వల్ల శరీరానికి ఎన్నో లాభాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*శరీరం డీటాక్సిఫై అవుతుంది
*జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
*ఉపవాసంలో పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది
*శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు

News July 6, 2025

టెక్సాస్ వరదలు.. 32కు చేరిన మృతుల సంఖ్య

image

అమెరికాలోని టెక్సాస్‌లో అకాల వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెర్ కౌంటీ షెరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరదల వల్ల చనిపోయినవారి సంఖ్య 32కు చేరుకుంది. మృతుల్లో 18 మంది పెద్దవాళ్లుకాగా.. 14 మంది చిన్నారులు ఉన్నారు. గల్లంతైన 27 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. రికవరీ చేసిన 8 మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోతున్నారు. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు ట్రంప్ సానుభూతి తెలియజేశారు.