News March 7, 2025
BRS ఎంపీలు లేకనే తెలంగాణకు అన్యాయం: కేసీఆర్

TG: లోక్సభలో BRS ప్రాతినిధ్యం లేకపోవటం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ 14 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకుందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏప్రిల్ 27న WGLలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ (25 ఏళ్ల) వేడుకలకు లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి ఫాంహౌస్లో పార్టీ నాయకులతో చర్చలు జరిపారు.
Similar News
News November 14, 2025
బిహార్: ఓటింగ్ పెరిగితే ఫలితాలు తారుమారు!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగిన ప్రతిసారీ అధికార పార్టీ కుర్చీ దిగిపోయిందని గత ఫలితాలు చెబుతున్నాయి. 1967లో దాదాపు 7% ఓటింగ్ పెరగగా అధికారంలోని INC కుప్పకూలింది. 1980లోనూ 6.8%, 1990లోనూ 5.7%శాతం పెరగగా అధికార మార్పిడి జరిగింది. ఇక తాజా ఎన్నికల్లోనూ 9.6% ఓటింగ్ పెరిగింది. మళ్లీ అదే ట్రెండ్ కొనసాగుతుందా లేక ప్రజలు NDAకే కుర్చీ కట్టబెడతారా అనేది ఈ మధ్యాహ్ననికి క్లారిటీ రానుంది.
News November 14, 2025
‘జూబ్లీ’ రిజల్ట్స్: రేవంత్ ప్రచారం పట్టం కట్టేనా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం CM రేవంత్కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీనికి కారణం ఆయనే స్టార్ క్యాంపెయినర్ కావడం. 2014 నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని రోజుల తరబడి రేవంత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు మంత్రులు కూడా తోడవటంతో ప్రచారం జోరందుకుంది. అలాగే గత ఎన్నికల్లో నవీన్ ఓటమి కూడా ఈసారి ఓటింగ్పై ప్రభావం చూపిందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
News November 14, 2025
చేతికి కంకణం ఎందుకు కట్టుకోవాలి..?

పూజ తర్వాత చేతికి కంకణం కట్టుకోవడం మన ఆచారం. పూజా ఫలం ఈ కంకణం ఉన్నన్ని రోజులు మనతోనే ఉండి, రక్షగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కంకణం మణికట్టుపై ఉన్న ముఖ్య నరాలపై ఒత్తిడి కలిగించి, జీవనాడి ప్రభావంతో హృదయ స్పందన రేటును సాధారణంగా ఉంచుతుందని నమ్ముతారు. ఇది ఆధ్యాత్మిక శక్తిని బంధించి, శరీరాన్ని సమతుల్యంగా ఉంచే ఒక పవిత్ర రక్షా కవచం లాంటిది. దీనిని మగవారు కుడిచేతికి, స్త్రీలు ఎడమచేతికి ధరించాలట.


