News March 7, 2025

BRS ఎంపీలు లేకనే తెలంగాణకు అన్యాయం: కేసీఆర్

image

TG: లోక్‌సభలో BRS ప్రాతినిధ్యం లేకపోవటం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ 14 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకుందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏప్రిల్ 27న WGLలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ (25 ఏళ్ల) వేడుకలకు లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పార్టీ నాయకులతో చర్చలు జరిపారు.

Similar News

News March 16, 2025

వచ్చే ఎన్నికల కోసమే స్టాలిన్ ఆరాటం: కిషన్ రెడ్డి

image

తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసమే ఆ రాష్ట్ర CM స్టాలిన్ త్రిభాషా విధానంపై రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘స్టాలిన్ వితండవాదం చేస్తున్నారు. ఏ రాష్ట్రంపైనా కేంద్రం హిందీని బలవంతంగా రుద్దదు. ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించాలని మొదట నిర్ణయించిందే మోదీ సర్కారు. రూపీ సింబల్‌ను మార్చడం తమిళనాడు ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం’ అని మండిపడ్డారు.

News March 16, 2025

మధ్యాహ్నం వీటిని తింటున్నారా?

image

మధ్యాహ్న భోజనంలో కచ్చితంగా సలాడ్లు ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే తెల్ల అన్నంకు బదులు క్వినోవా, బ్రౌన్ రైస్ లాంటి తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. బాగా వేయించిన కర్రీలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే బంగాళాదుంప, ప్రాసెస్డ్ ఫుడ్, మసాలా పదార్థాల జోలికి వెళ్లొద్దు.

News March 16, 2025

ఏఆర్ రెహమాన్ హెల్త్ అప్‌డేట్

image

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు బాగానే ఉన్నారని ఆయన తనయుడు అమీన్ తెలిపారు. ‘డీహైడ్రేషన్ కారణంగా నాన్నగారు కొంచెం బలహీనంగా అనిపించారు. అందుకే ఆస్పత్రిలో రొటీన్ టెస్టులు చేయించాం. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. తాను వైద్యులతో మాట్లాడానని, రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారని TN సీఎం స్టాలిన్ వెల్లడించారు. రెహమాన్‌ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

error: Content is protected !!