News September 21, 2024

ఇది క్షమించరాని నేరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

image

TG: తిరుమల లడ్డూ ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటమే కాకుండా బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.

Similar News

News October 7, 2024

యుద్ధాల్లేని భూగోళం కోసం ఏం చేయాలి!

image

‘విద్వేషం పాలించే దేశం ఉంటుందా, విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా, ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా, అడిగావా భూగోళమా, నువ్ చూశావా ఓ కాలమా’ అన్న సిరివెన్నెల లిరిక్స్ అక్షర సత్యాలు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఏడాది. రష్యా-ఉక్రెయిన్ వార్ రెండేళ్లు దాటేసింది. ఏవీ ఇప్పట్లో ముగిసేలా లేవు. తప్పెవరిదన్నది పక్కన పెడితే ప్రజలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. యుద్ధాల్లేని భూగోళం కోసం ఏం చేయాలి? మీ కామెంట్.

News October 7, 2024

సలార్-2 నుంచి క్రేజీ లీక్స్.. PHOTOS వైరల్

image

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన సలార్ సూపర్ హిట్ కావడంతో రెండో పార్ట్ శౌర్యాంగపర్వంపై అంచనాలు పెరిగాయి. గతంలోనే ఈ చిత్ర షూటింగ్ కొంత పూర్తవగా, దీనికి సంబంధించి టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ అంటూ కొన్ని క్లిప్స్ వైరలవుతున్నాయి. కాటేరమ్మ ఫైట్ కంటే క్రేజీగా ఉంటుందని టాక్. ఈ లీక్స్‌పై మేకర్స్ స్పందించలేదు. ప్రస్తుతం డైరెక్టర్, హీరో బిజీగా ఉండటంతో రెండో భాగం షూటింగ్ మరింత ఆలస్యం కానుంది.

News October 7, 2024

5Gపై ఫోకస్ తగ్గించిన రిలయన్స్ JIO

image

JIO 5G నెట్‌వర్క్ విస్తరణ వేగాన్ని తగ్గిస్తోంది. 4G యూజర్లు ఎక్కువ డబ్బులు చెల్లించే సేవలకు అప్‌గ్రేడ్ అవ్వడంపై ఫోకస్ పెట్టింది. Airtel సైతం ఫీచర్ ఫోన్లు వాడేవారిని స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. ఇవి వేగం పుంజుకొనేంత వరకు అవసరమైన 5G ఆపరేషన్స్ మాత్రమే కొనసాగిస్తాయని తెలిసింది. జియో 5G నెట్‌వర్క్ యుటిలైజేషన్ 15% ఉందని వెండర్స్, రెట్టింపు ఉంటుందని కంపెనీ సోర్సెస్ అంటున్నాయి.