News July 27, 2024
అది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: రేవంత్
TG: హైదరాబాద్‌లోని పాత బస్తీ ఓల్డ్ సిటీ కాదని ఒరిజినల్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఓల్డ్ సిటీని బీఆర్ఎస్ మోసం చేసింది. గత ప్రభుత్వం ఓల్డ్ సిటీలోకి మెట్రోను తీసుకురాలేకపోయింది. వచ్చే ఎన్నికలలోపు పాత బస్తీలో మెట్రో పూర్తి చేసి ఓట్లడుగుతా. పాతబస్తీలో మెట్రో నిర్మించకపోతే ఎల్అండ్‌టీ అధికారులను చంచల్‌గూడ, చర్లపల్లి జైలుకు పోతారని హెచ్చరించా’ అని సీఎం అసెంబ్లీలో ప్రసంగించారు.
Similar News
News December 13, 2024
కళకళలాడనున్న లోక్‌సభ.. ఎందుకంటే?
శీతకాల సమావేశాలు మొదలయ్యాక లోక్‌సభ సరిగ్గా జరిగిందే లేదు. ‘మోదీ, అదానీ ఏక్ హై’ అంటూ కాంగ్రెస్, ‘సొరోస్, రాహుల్ ఏక్ హై’, సొరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయంటూ BJP విమర్శించుకుంటున్నాయి. వజ్రోత్సవాల సందర్భంగా నేడు, రేపూ లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. దీనికి అన్ని పార్టీల ఎంపీలు హాజరవుతున్నారు. చాన్నాళ్ల తర్వాత సభ నిండుగా కళకళలాడనుంది. అర్థవంతమైన చర్చ జరిగేందుకు ఆస్కారం కనిపిస్తోంది.
News December 13, 2024
ఘోరం: నిద్రలేపిందని తల్లిని చంపేసిన బాలుడు!
కాలేజీకి వెళ్లమంటూ నిద్రలేపిన తల్లిని ఇంటర్ చదువుతున్న బాలుడు ఆగ్రహంతో తోసేశాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై మృతిచెందారు. UPలోని గోరఖ్‌పూర్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హత్య అనంతరం ఇంటికి తాళం వేసి నిందితుడు పరారయ్యాడు. చెన్నైలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న అతడి తండ్రి భార్య ఫోన్ తీయడం లేదని ఇంటికి వచ్చి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. పోలీసుల విచారణలో కొడుకే నిందితుడని తేలింది.
News December 13, 2024
మార్చి 3 నుంచి TG ఇంటర్ పరీక్షలు?
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై బోర్డు కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 3 నుంచి ప్రారంభించాలని భావిస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో ప్రాక్టికల్స్ నిర్వహించాలని చూస్తోంది. త్వరలోనే ఇంటర్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ షెడ్యూల్ ప్రకటించనుంది. మరోవైపు ఇప్పటికే ఏపీలో <<14851951>>ఇంటర్<<>>, <<14851568>>టెన్త్<<>> షెడ్యూల్ విడుదలైంది.