News April 24, 2024
TRSను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నది నిజమే: KCR
TRS పార్టీని అప్పట్లో కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నది వాస్తవమేనని, అయితే ఆ మాటను కాంగ్రెస్ వినలేదని కేసీఆర్ అన్నారు. ‘రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు కలిపి ఎన్నికలు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అది కరెక్ట్ కాదని, వద్దని నేను చెప్పినా వాళ్లు వినలేదు. దీంతో విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా. ఆ తర్వాత మేం ఇండిపెండెంట్‌గా నిల్చొని గెలిచాం’ అని కేసీఆర్ అన్నారు.
Similar News
News January 13, 2025
మరోసారి తగ్గనున్న మద్యం ధరలు!
APలో మద్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. లిక్కర్ బ్రాండ్లలో ధరల తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే మాన్షన్ హౌస్, అరిస్ట్రోకాట్ ప్రీమియం, కింగ్ ఫిషర్ వంటివి ధరలు తగ్గించుకోగా, బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ధరల తగ్గింపునకు ప్రభుత్వానికి అప్లై చేసుకుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
News January 13, 2025
రేషన్ కార్డులకు రికమెండేషన్స్ అవసరం లేదు: మంత్రి
TG: రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్డుల జారీకి ఎలాంటి రికమెండేషన్స్ అవసరం లేదని, అర్హులైన వారందరికీ ఇస్తామని చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారిలో ఎవరైనా అనర్హులుంటే గ్రామ సభల్లో చెప్పాలని అన్నారు. వారి అప్లికేషన్లను పక్కనపెడతామని పేర్కొన్నారు.
News January 13, 2025
బీసీసీఐ కొత్త సెక్రటరీ, ట్రెజరర్ ఎవరంటే?
బీసీసీఐ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ట్రెజరర్‌గా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియాను ఎన్నుకున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. తక్షణమే వీరు తమ బాధ్యతలను చేపడతారని పేర్కొంది. నిన్న జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపింది. జైషా, ఆశిష్ షెలార్ స్థానాలను భర్తీ చేస్తున్న వీరు సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ పేర్కొన్నారు.