News May 10, 2024
టాలీవుడ్‌లో నటించాలంటే చాలా కష్టం: సంయుక్త

తెలుగు సినిమాల్లో నటించడం తనకు కష్టమని హీరోయిన్ సంయుక్త మీనన్ తాజాగా పేర్కొన్నారు. మలయాళ సినిమాలు చేయడమే సులువన్నారు. ‘తెలుగు భాష రాకపోవడం ఒక కారణం కాగా.. మేకప్ భారీగా వేసుకోవాల్సి రావడం మరో ఇబ్బంది. మలయాళ సినిమాల్లో మేకప్ తక్కువ. కానీ తెలుగు సినిమాలకు చాలా మేకప్ వేస్తారు. అసౌకర్యంగా ఉంటుంది. ప్రతిసారీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ముఖంపై ఏదో బరువు ఉన్నట్లు అనిపిస్తుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News February 12, 2025
వాలంటైన్స్ వీక్: ఇవాళ HUG DAY

ప్రేమను వ్యక్తపరిచేందుకు అనేక రకాల మార్గాలున్నాయి. ఫిజికల్ ఎఫెక్షన్‌ను చూపించేందుకు వాలంటైన్స్ వీక్‌లో ఇవాళ హగ్ డే జరుపుకొంటారు. ప్రేమను, ధైర్యాన్ని, భరోసాను ఇలా వ్యక్తపరుస్తూ ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. హగ్ ఇవ్వడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా బీపీ కంట్రోల్‌లో ఉంటుందట. హాయికరమైన నిద్ర, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని అంటున్నారు.
News February 12, 2025
42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: ఆర్ కృష్ణయ్య

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రిజర్వేషన్లు పెంచకుండా కులాల వారీగా జనాభా లెక్కలు తప్పుగా చూపిస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
News February 12, 2025
ప్రధానికి బెదిరింపు కాల్

PM మోదీ టార్గెట్‌గా బెదిరింపు కాల్ వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన విదేశీ పర్యటన నేపథ్యంలో ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారమివ్వడంతో కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా గుర్తించారు. మోదీ పర్యటనకు ముందే ఈ కాల్ వచ్చినట్లు తెలిపారు.