News November 18, 2024
నాడు కుల గణన చేపట్టకపోవడం తప్పే: రాహుల్

UPA హయాంలో ప్రతిపాదన వచ్చినప్పుడు కులగణన చేపట్టకపోవడం తప్పేనని LoP రాహుల్ అంగీకరించారు. దాన్ని సరిదిద్దుకోవడానికే TG, కర్ణాటకలో సర్వేలు ఆరంభించామని తెలిపారు. ప్రజలతో చర్చించాకే ప్రశ్నావళి రూపొందించామన్నారు. కాంగ్రెస్-JMM గెలిచాక ఝార్ఖండ్‌లోనూ ఇలాగే చేస్తామన్నారు. BCలపై డేటా లేకపోవడం వల్లే సరైన విధానాలు రూపొందించడం లేదని, న్యాయబద్ధంగా సంపద పంపిణీ జరగడం లేదని పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
పెళ్లి చేసుకున్న సమంత!

స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వీరిద్దరి వివాహం జరిగినట్లు వెల్లడించాయి. ఈ కపుల్‌కు పలువురు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. కాగా పెళ్లికి సంబంధించి ఈ జోడీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
News December 1, 2025
యువతకు ‘గీత’ చెప్పిన కర్మ సిద్ధాంతం ఇదే!

నేటి యువతరం భగవద్గీత నుంచి కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి. లక్ష్యంపై దృష్టి పెట్టి, ఫలితంపై ఆందోళన చెందకుండా తమ పనిని నిస్వార్థంగా చేయాలని గీత బోధిస్తుంది. మంచి జరిగినా, చెడు జరిగినా రెండింటినీ జీవితంలో భాగమే అనుకొని, ఏకాగ్రతతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలి. ఈ ఆత్మవిశ్వాసం, నిలకడ నేటి పోటీ ప్రపంచంలో విజయానికి కీలకం. SHARE IT
News December 1, 2025
తెలంగాణ అప్‌డేట్స్

*రైతు భరోసా ఇవ్వకుండా కౌలు రైతులను ప్రభుత్వం మోసగించిందని BRS నేత హరీశ్ విమర్శించారు.
* టెట్ దరఖాస్తులలో వివరాల సవరణ గడువు నేటితో ముగియనుంది. పేరు, ఆధార్, ఫోన్ నంబర్, అర్హతలు, సెంటర్లు మార్పు చేసుకోవచ్చు.
* కరెంటు సహా ఇతర బిల్లుల ఆధారంగా ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ ఇచ్చేందుకు ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB)’ను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ స్కోరుతో బ్యాంకులు SHG సభ్యులకు లోన్లు ఇస్తాయి.


