News November 7, 2024
ట్రూకాలర్ ఆఫీసులపై ఐటీ రైడ్స్

పన్ను ఎగవేత ఆరోపణలపై ట్రూకాలర్ ఆఫీసుల్లో IT అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగళూరు, ముంబై, గురుగ్రామ్ ఆఫీసుల్లో తనిఖీలు జరిపారు. పన్ను ఎగవేత సహా, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ (అనుబంధ సంస్థల మధ్య లావాదేవీలు) విషయమై అధికారులు డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. ముందస్తు నోటీసులు లేకుండా చేసిన తనిఖీలపై అధికారులకు సహకరించినట్టు ట్రూకాలర్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Similar News
News January 16, 2026
APలో స్మాల్ మిక్స్డ్ మాడ్యులర్ ఎనర్జీ రియాక్టర్

AP: థర్మల్ ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గిస్తూ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేలా చిన్నస్థాయిలో థర్మల్, హైడ్రో మిక్స్డ్ ఎనర్జీ రియాక్టర్ను నెలకొల్పేందుకు ఏపీ జెన్కో ఆలోచిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కోల్ ఇండియాతో కలిసి జాయింట్ వెంచర్ కింద దీనికి సంబంధించిన ప్లాంటు ఏర్పాటు ఆలోచన ఉందని జెన్కో ఎండీ నాగలక్షి ‘ది హిందూ’తో పేర్కొన్నారు. అయితే ఇది బొగ్గు రవాణా, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు.
News January 16, 2026
IOCLలో 405 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News January 16, 2026
‘అనగనగా ఒక రాజు’.. రూ.41.2 కోట్ల కలెక్షన్స్

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వరల్డ్ వైడ్గా 2 రోజుల్లో రూ.41.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మొదటి రోజు ఈ చిత్రం రూ.22కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.


