News November 7, 2024
ట్రూకాలర్ ఆఫీసులపై ఐటీ రైడ్స్
పన్ను ఎగవేత ఆరోపణలపై ట్రూకాలర్ ఆఫీసుల్లో IT అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగళూరు, ముంబై, గురుగ్రామ్ ఆఫీసుల్లో తనిఖీలు జరిపారు. పన్ను ఎగవేత సహా, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ (అనుబంధ సంస్థల మధ్య లావాదేవీలు) విషయమై అధికారులు డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. ముందస్తు నోటీసులు లేకుండా చేసిన తనిఖీలపై అధికారులకు సహకరించినట్టు ట్రూకాలర్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Similar News
News December 11, 2024
నాగబాబుకు మంత్రి పదవి.. ఇచ్చేది ఈ శాఖేనా?
AP: మంత్రివర్గంలో చేరబోతున్న నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ కావడంతో టూరిజంతోపాటు కందుల దుర్గేశ్ వద్ద ఉన్న ఈ శాఖ బదిలీ సులభం అవుతుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నాగబాబు సినిమాటోగ్రఫీ మంత్రి అయితే ఇటు ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటారని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గనుల శాఖ ఇస్తారనే ప్రచారమూ ఉంది.
News December 11, 2024
నేడు, రేపు కలెక్టర్ల సదస్సు
AP: రాష్ట్ర ప్రభుత్వం నేడు, రేపు వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. CM చంద్రబాబు అధ్యక్షత వహించనున్న ఈ సదస్సులో స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న రోజుల్లో అందించే పాలన, తదితరాలపై దిశానిర్దేశం చేయనున్నారు. సదస్సు ఉదయం 10.30గంటలకు ప్రారంభమై సాయంత్రం 7.30 వరకు కొనసాగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఓసారి సదస్సు నిర్వహించగా, ఇది రెండోది.
News December 11, 2024
హోంమంత్రి అనితపై కేసు కొట్టివేత
AP: హోంమంత్రి అనితకు చౌక్ బౌన్స్ కేసులో ఊరట దక్కింది. తన వద్ద తీసుకున్న రూ.70లక్షలకు గానూ అనిత ఇచ్చిన చెక్కు చెల్లలేదని 2019లో వేగి శ్రీనివాసరావు అనే వ్యక్తి విశాఖ కోర్టును ఆశ్రయించారు. కేసును రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని వీరిద్దరూ నిర్ణయానికి రాగా, విశాఖ కోర్టులో ప్రొసీడింగ్స్ కొట్టేయాలని అనిత హైకోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం విచారణ జరగ్గా ఆమెపై ఉన్న కేసును కోర్టు కొట్టేసింది.