News May 11, 2024
మంగళగిరిలో ఐటీ సోదాలు.. రూ.8కోట్ల పట్టివేత

AP: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఓ వస్త్ర, వడ్డీ వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు రూ.8 కోట్ల వరకు నగదు, రూ.25 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ ఇంత మొత్తం నగదు లభించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 16, 2025
CLAT-2026 ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT)-2026 ఫలితాలు విడుదలయ్యాయి. <
News December 16, 2025
కోడి గీతలతో YCP కోటి సంతకాల డ్రామా: సత్యకుమార్

AP: మెడికల్ కాలేజీల విషయంలో ప్రజా మద్దతు లేక YCP చీఫ్ జగన్ కోడి గీతలతో కోటి సంతకాల డ్రామా ఆడుతున్నారని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా 10 వైద్య కళాశాలలను PPP విధానంలో నడపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జగన్ దాన్ని ప్రైవేటీకరణగా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం, కోర్టులు PPPని సమర్థించాయని, దీనిపై ఆయన కోర్టుకెళ్తేనే మేలని చెప్పారు.
News December 16, 2025
రూ.1,000 కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారుగా.. న్యాయమూర్తి ఆశ్చర్యం

TG: ఏళ్ల తరబడి కరెంట్ బిల్లు చెల్లించట్లేదంటూ TGSPDCL గీతం యూనివర్సిటీకి ఇటీవల నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆ వర్సిటీ హైకోర్టుకు వెళ్లింది. 2008 నుంచి రూ.118 కోట్ల బిల్లులు కట్టకపోవడంతో జస్టిస్ నగేశ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సామాన్యులు రూ.1,000 కట్టకపోతే అధికారులు విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారని, గీతం వర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని ప్రశ్నించారు. విద్యుత్ శాఖ SE హాజరుకావాలని ఆదేశించారు.


