News December 24, 2024
బట్టతలకు చికిత్స దొరికేసినట్లేనా.?
బట్టతలపై జుట్టు మొలిపించే పరిష్కారం తమకు లభించిందని UK, పాక్ పరిశోధకులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘చిట్టెలుకలపై గాయాలను మాన్పించే ప్రయోగం చేస్తున్న సమయంలో వాటికి డియాక్సీరిబోస్ అనే షుగర్ను ఇచ్చాం. దాన్ని ఇచ్చిన చోట ఎలుకలకు కొత్తగా జుట్టు మొలిచింది. మనిషి శరీరంలో ఈ షుగర్ అంతర్భాగం. దీన్ని వాడటం ద్వారా బట్టతలపై వెంట్రుకల్ని మళ్లీ తెప్పించేందుకు అవకాశం ఉంది’ అని వారు వివరించారు.
Similar News
News December 25, 2024
గాంధీ వందేళ్ల జ్ఞాపకం.. 2 రోజులు CWC సమావేశాలు
ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు, ఎల్లుండి కాంగ్రెస్ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే ఈ సమావేశానికి ‘నవ సత్యాగ్రహ బైఠక్’గా పేరు పెట్టింది. 26వ తేదీన CWC సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు సహా 200 మంది కీలక నేతలు హాజరై పలు అంశాలపై చర్చిస్తారు. 27న నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో లక్ష మంది కార్యకర్తలు పాల్గొంటారు.
News December 25, 2024
ఏపీ కొత్త సీఎస్గా సాయి ప్రసాద్?
AP: రాష్ట్ర CS నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో కొత్త CS ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సీనియార్టీ జాబితాలో IAS శ్రీలక్ష్మి టాప్లో ఉన్నారు. అయితే ఆమెను నియమించడానికి CM సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆమె తర్వాత అనంతరాము ఉన్నప్పటికీ సాయిప్రసాద్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈయన గతంలో CBN పేషీలో కార్యదర్శిగా పనిచేశారు.
News December 25, 2024
నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
TG: CM రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఆయన తొలుత ఏడుపాయల వనదుర్గమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆపై అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం మెదక్ CSI చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పాయి. అటు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు.