News March 18, 2024

వర్షం మొదలైంది..

image

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కొండాపూర్, మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. నగరంలోని పలు చోట్ల వాతావరణం చల్లబడింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. మారిన వాతావరణంతో రిలాక్స్ అవుతున్నారు. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

Similar News

News October 15, 2025

కల్తీ మద్యం.. ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధనలు

image

AP:* క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేశాకే మద్యం అమ్మాలి
* ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా సీసాపై కోడ్ స్కాన్ చేయాలి
* విక్రయించే మద్యం నాణ్యమైనదని ధ్రువీకరించినట్లు ప్రతి దుకాణం, బార్ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలి
* ప్రతి దుకాణం, బార్‌లో డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు
* మద్యం దుకాణాల్లో ర్యాండమ్‌గా ఎక్సైజ్ శాఖ తనిఖీలు
* నకిలీ మద్యం గుర్తిస్తే షాపు లైసెన్స్ రద్దు

News October 15, 2025

బ్యూటీపార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అంటే?

image

బ్యూటీపార్లర్లలో కస్టమర్ల మెడను వెనక్కు వంచి ఎక్కువసేపు బేసిన్‌పై ఉంచినప్పుడు కొందరిలో మెడ దగ్గరుండే వెర్టిబ్రల్ ఆర్టరీ అనే రక్తనాళం నొక్కుకుపోతుంది. కొన్నిసార్లు దాని గోడల్లోనూ చీలిక వచ్చి రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీన్నే బ్యూటీపార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అంటారు. దీనివల్ల తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, చూపు కనిపించకపోవడం, సగం శరీరంలో తిమ్మిర్లు, పక్షవాతం, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలొస్తాయి.

News October 15, 2025

బ్యూటీపార్లర్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

బ్యూటీపార్లర్ సిబ్బంది శిక్షణ పొందినవారేనా? బ్యూటీపార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్‌పై అవగాహన ఉందా? అనేది ముందుగా తెలుసుకోండి. హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు మెడకు సరైన సపోర్టు తీసుకోవాలి. ఓ మెత్తని వస్త్రం పెట్టుకోవడం మంచిది. మెడను ఎక్కువగా వెనక్కి వంచకూడదు. అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఆపమని చెప్పాలి. అత్యవసరమైతే తప్ప తరుచూ బ్యూటీపార్లర్లకు వెళ్లకపోవడం ఉత్తమం.