News March 18, 2024
వర్షం మొదలైంది..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కొండాపూర్, మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. నగరంలోని పలు చోట్ల వాతావరణం చల్లబడింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. మారిన వాతావరణంతో రిలాక్స్ అవుతున్నారు. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.
Similar News
News April 14, 2026
ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

AP: కడప(D) ఒంటిమిట్టలో ఇవాళ 45°C ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల(D) సంజామల 44.2°C, తిరుపతి(D) వరదయ్యపాలెంలో 43.8°C ఉష్ణోగ్రత నెలకొంది. 262 మండలాల్లో 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు SDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News April 14, 2026
కొవిడ్ వ్యాక్సిన్‌తోనే నాన్న చనిపోయారు: వార్న్ కుమారుడు

స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణానికి కారణం కరోనా వ్యాక్సిన్ అని ఆయన కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాక్సిన్‌తో తన తండ్రి అనారోగ్య సమస్యలు ముదిరాయని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ఇష్టం లేకపోయినా ఇతరుల ఒత్తిళ్లతో ఆయన టీకా డోసులు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని అంత్యక్రియలప్పుడే చెప్పాలని అనుకున్నా కొన్ని కారణాలతో ఆగిపోయానని అన్నారు. కాగా షేన్ వార్న్ 2022లో చనిపోయారు.



