News December 3, 2024

డెడ్‌లైన్ చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

image

ఇజ్రాయెల్ మహిళలను బంధించిన హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 2025, JAN 20లోపు బందీలను విడిచిపెట్టాలని సూచించారు. లేదంటే వెస్ట్ ఏషియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా అరాచకంగా వ్యవహరిస్తున్న వారికి శిక్ష తప్పదన్నారు. బందీల గురించి అంతా అయ్యో అంటున్నారే కానీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. JAN 20న వైట్‌హౌస్‌లో ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు.

Similar News

News November 19, 2025

43 మంది నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు

image

బిహార్‌లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా 43 మంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారిపై క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈనెల 21 లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ లోపు స్పందించకపోతే పార్టీ నుంచి తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News November 19, 2025

మూవీ ముచ్చట్లు

image

*రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం నుంచి ‘రణ కుంభ’ ఆడియో సాంగ్ విడులైంది.
*‘బాహుబలి ది ఎపిక్’ సినిమా జపాన్‌లో రిలీజ్ కానుందని సమాచారం. డిసెంబర్ 12న విడుదల చేస్తారని, 5న ప్రీమియర్‌కు ప్రభాస్‌, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరవుతారని తెలుస్తోంది.
*ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా విజువల్‌గా, మ్యూజికల్‌గా భారీగా ఉండబోతోంది: మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

News November 19, 2025

టీమ్ ఇండియా ప్రాక్టీస్‌లో మిస్టరీ స్పిన్నర్‌

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో స్పిన్నర్ల ధాటికి టీమ్ ఇండియా ఘోరంగా <<18303459>>ఓడిన <<>>సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు మిస్టరీ స్పిన్నర్‌ను మేనేజ్‌మెంట్ రంగంలోకి దించింది. ప్రాక్టీస్ సెషన్‌లో స్పిన్నర్ కౌశిక్ మైతీతో బౌలింగ్ చేయించింది. 2 చేతులతో బౌలింగ్ చేయగలగడం కౌశిక్ ప్రత్యేకత. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు కుడి చేతితో, రైట్ హ్యాండ్ బ్యాటర్లకు ఎడమ చేతితో బౌలింగ్ వేయగలరు.