News December 3, 2024
డెడ్‌లైన్ చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

ఇజ్రాయెల్ మహిళలను బంధించిన హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 2025, JAN 20లోపు బందీలను విడిచిపెట్టాలని సూచించారు. లేదంటే వెస్ట్ ఏషియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా అరాచకంగా వ్యవహరిస్తున్న వారికి శిక్ష తప్పదన్నారు. బందీల గురించి అంతా అయ్యో అంటున్నారే కానీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. JAN 20న వైట్‌హౌస్‌లో ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు.
Similar News
News March 5, 2026
10 సార్లు సీఎం.. ఇక శకం ముగిసినట్లే!

బిహార్‌లో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు నితీశ్ పేరిట ఉంది. ఏకంగా 10 సార్లు ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి 2000 సం.లో కేవలం 7 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2005, 10, 15 (2 సార్లు), 17, 20, 22, 24, 25లో CM కుర్చీ ఎక్కారు. OBCలు, మహిళల మద్దతుతో పాటు వివిధ పార్టీలతో పొత్తుల ద్వారా ఎక్కువ కాలం సీఎంగా కొనసాగారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్‌లో ఆయన శకం ముగిసినట్లే భావించాలి.
News March 5, 2026
ప్రపంచంలో రద్దీగా ఉండే జలసంధులు ఇవే..

వివిధ ఖండాల మధ్య ఉన్న జలసంధుల ద్వారా చమురు రవాణా సాగుతుంటుంది. ఇందులో మలక్కా జలసంధి అతి ముఖ్యమైనది. ఇండోనేషియా దీవుల్లో ఉండే ఈ సంధి ద్వారా రోజుకు 23.2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ సరఫరా అవుతుంది. ఆ తర్వాత ఇరాన్ దగ్గరలోని హార్ముజ్ (20.9 M), సౌతాఫ్రికా కింద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ (9.1 M), ఈజిప్ట్ సూయిజ్ కెనాల్ (4.9 M), డానిష్ సంధి (4.9 M) ఉన్నాయి. తాజా యుద్ధంతో హార్ముజ్‌ను మూసివేశారు.
News March 5, 2026
హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

HYDలోని<


