News April 10, 2024
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన ధరలు

బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్స్ మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.380 పెరిగి రూ.72,110కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.350 పెరిగి 66,100గా నమోదైంది. సిల్వర్ రేట్ కూడా అస్సలు తగ్గడం లేదు. తాజాగా కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.89,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News February 16, 2026
ఆర్థికంగా మెరుగుపడాలంటే ఈ తప్పులు వద్దు

‘ఇంట్లో శుభం కలగాలంటే ముఖద్వారం శుభ్రంగా ఉండాలి. ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, షూలు వదలకూడదు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. ద్వారం వద్ద రాహువు ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ గజిబిజిగా ఉంచకూడదు. షూ రాక్ ఉంచడం ఉత్తమం. ఇంట్లో అన్ని వస్తువులు పద్ధతిగా అమర్చుకోవాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, సుఖసంతోషాలు కలుగుతాయి’ అంటున్నారు వాస్తు నిపుణులు.
News February 16, 2026
బనారస్ హిందూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

<
News February 16, 2026
TGలో మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక అప్డేట్స్

* నిజామాబాద్ మేయర్‌గా ఉమారాణి(కాంగ్రెస్)
* కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్(బీజేపీ)
* నల్గొండ మేయర్‌గా బుర్రి చైతన్య(కాంగ్రెస్)
* ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్
* కోరం లేకపోవడంతో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
* అలియాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కంఠం శిరీష(కాంగ్రెస్)


