News April 10, 2024
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన ధరలు

బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్స్ మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.380 పెరిగి రూ.72,110కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.350 పెరిగి 66,100గా నమోదైంది. సిల్వర్ రేట్ కూడా అస్సలు తగ్గడం లేదు. తాజాగా కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.89,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News March 23, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

బర్డ్‌ఫ్లూ భయాన్ని వీడి ప్రజలు ఇప్పుడిప్పుడే చికెన్ తినడం మళ్లీ మొదలుపెడుతున్నారు. దీంతో ఏపీ, తెలంగాణలో కోడి మాంసం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి కేజీ చికెన్ రూ.170 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.160కి కూడా లభిస్తోంది. అయితే ఎండలు ముదరడంతో ఫారాల్లో కోళ్ల మరణాలు పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో సప్లై తగ్గి చికెన్ ధర పెరిగే ఛాన్స్ ఉంది.
News March 23, 2025
నరైన్ ‘హిట్ వికెట్’.. ఎందుకు ఔట్ ఇవ్వలేదంటే?

నిన్న RCBతో మ్యాచ్‌లో KKR బ్యాటర్ సునీల్ నరైన్ ‘హిట్ వికెట్’పై చర్చ జరుగుతోంది. MCC నిబంధనల ప్రకారం బ్యాటర్ బంతిని ఆడేటప్పుడు లేదా పరుగు తీసే క్రమంలో బ్యాట్ వికెట్లను తాకితేనే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. అయితే నిన్న బంతి నరైన్ పైనుంచి వెళ్లి కీపర్ చేతిలో పడ్డ తర్వాత బ్యాట్ వికెట్లను తాకింది. అప్పటికే అంపైర్ బంతిని వైడ్‌గా ప్రకటించారు. అందుకే దాన్ని నరైన్‌ను నాటౌట్‌గా ప్రకటించారు.
News March 23, 2025
బంగ్లాలో హిందువులపై ప్రణాళిక ప్రకారమే హింస: RSS

బంగ్లాలో హిందువులపై మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) ఆందోళన వ్యక్తం చేసింది. అఖిల భారతీయ ప్రతినిధి సభ(ABPS)లో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. ‘బంగ్లాలో హిందువులపై ప్రణాళికాబద్ధంగా హింసకు పాల్పడుతున్నారు. మైనారిటీలను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. ఇస్లామిస్ట్ శక్తుల చేతిలో మైనారిటీలు నరకాన్ని చూస్తున్నారు’ అని అందులో పేర్కొంది.