News June 2, 2024

కోచ్‌గా గంభీర్‌ను నియమిస్తే మంచిదే: గంగూలీ

image

భారత జట్టుకు కోచ్‌గా గంభీర్‌ను ఎంపిక చేస్తే అది మంచి నిర్ణయం అవుతుందని మాజీ క్రికెటర్ గంగూలీ అన్నారు. గౌతీ నిజాయితీపరుడు, గేమ్‌ను అర్థం చేసుకోగల వ్యక్తని కొనియాడారు. మెంటార్‌గా KKRను విజయవంతంగా నడిపిన ఆయనకు ప్రధాన కోచ్ అవడానికి అన్ని లక్షణాలు ఉన్నాయన్నారు. విరాట్, రోహిత్ వంటి స్టార్లను డీల్ చేయడం గౌతీకి తెలుసని చెప్పారు. ఆయన జట్టులోకి వస్తే మంచి మార్పు తీసుకొస్తారని దాదా అభిప్రాయపడ్డారు.

Similar News

News September 14, 2024

UPSC సివిల్ సర్వీసెస్ అడ్మిట్ కార్డులు విడుదల

image

UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <>https://upsconline.nic.in/<<>> వెబ్‌సైట్‌లో ఈ నెల 29 వరకు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి 29 వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఆల్ ఇండియా సర్వీసుల్లో 1,056 పోస్టుల భర్తీకి జూన్ 16న ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగగా, జులై 1న ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే.

News September 14, 2024

ఒక్క బాల్ పడకుండా మ్యాచ్ రద్దు.. కేవలం 8 సార్లే

image

నోయిడా వేదికగా జరగాల్సిన కివీస్vsఅఫ్గాన్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే <<14089444>>రద్దయ్యింది<<>>. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలాంటి సందర్భాలు కేవలం ఎనిమిదిసార్లే నమోదయ్యాయి. 1890, 1938, 1970లో ఇంగ్లండ్vsఆస్ట్రేలియా మ్యాచ్‌లు, 1988లో కివీస్vsపాక్, 1989లో విండీస్vsఇంగ్లండ్, 1998లో పాక్vsజింబాబ్వే, 1998లో కివీస్vsఇండియా మ్యాచ్‌లు ఒక్క బాల్ పడకుండానే రద్దయ్యాయి.

News September 14, 2024

ఫలితాలు విడుదల

image

RRB ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను IBPS విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు <>ibpsonline.ibps.in<<>> వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇవి ఈనెల 20 వరకు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 3,4,10,17,18 తేదీల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఇందులో క్వాలిఫై అయినవారికి సెప్టెంబర్ 29న మెయిన్స్ నిర్వహిస్తారు.