News March 22, 2024
ధోనీ ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: మాజీ క్రికెటర్
IPLలో CSK కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ధోనీ ఆటగాడిగా కూడా రిటైర్ అయితే బాగుండేది. MSD ప్లేయర్‌గా ఉన్న జట్టును కెప్టెన్‌గా ముందుకు నడిపించడం రుతురాజ్‌కు సాధ్యం కాదు. కొత్త కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ధోనీ అంగీకరించవచ్చు. వద్దని చెప్పవచ్చు. ధోనీ గ్రౌండ్‌లో ఉంటే రుతురాజ్ సొంత నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News September 9, 2024
TODAY HEADLINES
➣AP: బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం: CBN
➣AP: అతి భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
➣TG: జర్నలిస్టులకు భూమి పత్రాలు అందించిన CM రేవంత్
➣బురద రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: లోకేశ్
➣పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇచ్చిన CBN: కురసాల
➣TG:కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నాం: హైడ్రా కమిషనర్
➣ ప్రజా ప్రభుత్వం.. కూల్చేదేమో పేదల ఇళ్లు: KTR
➣31 సాకులతో రైతు రుణమాఫీకి కోతలు: హరీశ్
News September 8, 2024
రికార్డు ధర పలికిన గణేశ్ లడ్డూ
AP: దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నెల్లూరులో గణేశుడి లడ్డూ రికార్డు ధర పలికింది. మాగుంట లే అవుట్‌లో ఏర్పాటు చేసిన మండపంలో లడ్డూ వేలం పాట నిర్వహించగా, పోటాపోటీలో చివరకు రూ.8.01 లక్షలు పలికింది. తేజస్విని గ్రాండ్ అధినేత శ్రీనివాసులు రెడ్డి లడ్డూని వేలంలో దక్కించుకున్నారు.
News September 8, 2024
ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు.. ఘాట్ రోడ్లపై రాకపోకలు నిషేధం
AP: అల్లూరి జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయన్న హెచ్చరికలతో కలెక్టర్ దినేశ్ కుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు. వాగులు, గెడ్డలు దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు. వాహనదారులు ఘాట్ రోడ్లలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో నర్సీపట్నం-సీలేరు, వడ్డాది-పాడేరు, అరకు-అనంతగిరి, రంపచోడవరం-మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలను నిషేధించారు.