News January 26, 2025
నా తండ్రి జీవించి ఉంటే బాగుండేది: అజిత్

పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నట్లు తమిళ హీరో అజిత్ తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ రోజు నా తండ్రి జీవించే ఉంటే బాగుండేది. ఆయన నన్ను చూసి గర్వపడేవారు. నా తల్లి ప్రేమకు, త్యాగాలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నాకు ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదని, అనేక మంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నా’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News February 14, 2025
YCP మాజీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు

AP: దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ సుధీర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కారు అడ్డుకోవడం, దౌర్జన్యం, బెదిరింపులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బుధవారం రాత్రి ఓ వివాహ కార్యక్రమంలో ఘర్షణ జరిగిందని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 14, 2025
వివాదాస్పద కామెంట్స్.. సుప్రీంకు యూట్యూబర్

పేరెంట్స్ సెక్స్‌పై కామెంట్స్ <<15413969>>వివాదంలో<<>> తనపై నమోదైన FIRలను క్వాష్ చేయాలంటూ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరగా ధర్మాసనం తిరస్కరించింది. త్వరగా విచారించడం కుదరని, ప్రొసీజర్ ప్రకారమే చేపడతామని చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా స్పష్టం చేశారు. కాగా షెడ్యూల్ ప్రకారం రణ్‌వీర్ పిటిషన్ విచారణకు రావడానికి రెండు, మూడు రోజులు పట్టనుంది.
News February 14, 2025
పెన్షన్లు తెచ్చిన సీఎం ఈయనే

దామోదరం సంజీవయ్య 1960-62 వరకు CMగా ఉన్నారు. ఈయనది కర్నూలు జిల్లా పెద్దపాడు. అవినీతి అధికారులను పట్టుకునే ఏసీబీ ఆయన హయాంలోనే ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే గవర్నమెంట్ టీచర్లకు, వృద్ధులకు పెన్షన్ తీసుకొచ్చారు. కాపు కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగిస్తే వారిని తిరిగి బీసీల్లో చేర్చారు. మండల్ కమిషన్ కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారు. 6 లక్షల ఎకరాలను పేదలకు పంచారు.
*ఇవాళ ఆయన జయంతి