News October 4, 2024

మంత్రి అలా మాట్లాడటం సిగ్గుచేటు: అశ్విని వైష్ణవ్

image

మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ మహిళా వ్యతిరేక ఆలోచనను సూచిస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ‘ఒక మంత్రి ఇలా సినీ ప్రముఖుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. ఫిల్మ్ ఇండస్ట్రీని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందనే దానికి ఇదే నిదర్శనం. దీనిపై రాహుల్ గాంధీ, పార్టీ అధిష్ఠానం మౌనంగా ఉండటం చూస్తుంటే వారు ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు అర్థం అవుతోంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 24, 2025

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు బ్రాహ్మణుల నిరసన

image

బ్రాహ్మణులను కించపరిచేలా పాట పాడిన జీడీ నరసయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. జీడి నరసయ్యపై వెంటనే ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా చూడాలని కోరారు.

News November 24, 2025

ఐబొమ్మ రవి సంపాదన రూ.100 కోట్లు?

image

మూవీల పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో ఐబొమ్మ <<18377140>>రవి<<>> రూ.100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌ను సేకరించినట్లు సమాచారం. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్‌కు లింక్ అయ్యేలా వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేశాడని గుర్తించారు. మరోవైపు ఈ విచారణపై రేపు ప్రెస్‌మీట్‌లో సజ్జనార్ వివరాలను వెల్లడిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

News November 24, 2025

అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

image

TG: పటాన్‌చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్‌కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్‌కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.