News October 4, 2024
మంత్రి అలా మాట్లాడటం సిగ్గుచేటు: అశ్విని వైష్ణవ్
మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ మహిళా వ్యతిరేక ఆలోచనను సూచిస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ‘ఒక మంత్రి ఇలా సినీ ప్రముఖుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. ఫిల్మ్ ఇండస్ట్రీని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందనే దానికి ఇదే నిదర్శనం. దీనిపై రాహుల్ గాంధీ, పార్టీ అధిష్ఠానం మౌనంగా ఉండటం చూస్తుంటే వారు ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు అర్థం అవుతోంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 5, 2024
పార్టీకి తక్కువ డబ్బిచ్చావన్నందుకు చంపేశాడు!
పార్టీ చేసుకున్నాక ఖర్చు షేర్ చేసుకోవడం కామన్. ఆ లెక్కల్లో తేడాలు వస్తే పెద్ద దుమారమే రేగుతుంది. MPలోని జబల్‌పూర్‌లో అదే జరిగింది. మనోజ్(26) తన మేనల్లుడు ధరమ్ ఠాకూర్(19) డియోరీ తపారియా అనే గ్రామంలో మందు, చికెన్‌తో పార్టీ చేసుకున్నారు. మందుకు ₹340, చికెన్‌కు ₹60 అయ్యింది. పార్టీ అయ్యాక ‘నువ్వు తక్కువ డబ్బు ఇచ్చావు’ అని మనోజ్ అనడంతో గొడవ మొదలైంది. కోపంతో ధరమ్ మేనమామ మనోజ్‌ను కర్రతో కొట్టి చంపాడు.
News November 5, 2024
నవంబర్ 5: చరిత్రలో ఈరోజు
* 1877: సంస్కృతాంధ్ర పండితులు పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి జననం
* 1920: ఇండియన్ ‘రెడ్‌క్రాస్’ ఏర్పడింది
* 1925: కవి, రచయిత ఆలూరి బైరాగి జననం
* 1987: మహాకవి దాశరథి కృష్ణమాచార్య మరణం
* 1988: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు(ఫొటోలో)
* 2019: నటుడు, దర్శకుడు కర్నాటి లక్ష్మీనరసయ్య మరణం
News November 5, 2024
కమల పూర్వీకుల గ్రామంలో ప్రత్యేక పూజలు
US అధ్యక్ష ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. భారత సంతతికి చెందిన కమలా హారిస్ డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆమె పూర్వీకుల గ్రామమైన TNలోని తులసేంద్రపురం ఆలయంలో స్థానికులు ప్రత్యేక పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయం వద్ద ‘ది డాటర్ ఆఫ్ ది ల్యాండ్’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. కమలా హారిస్ తాత పీవీ గోపాలన్ ఇదే గ్రామంలో జన్మించారు.