News September 27, 2024
ఇదంతా నిరంతర ప్రక్రియ: జగన్
AP: తిరుమలలో నెయ్యి కొనుగోలు టెండర్లు ప్రతి 6 నెలలకోసారి, L1గా వచ్చిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తారని జగన్ వెల్లడించారు. ‘TTDలో తప్పు చేయడానికి వీల్లేని వ్యవస్థలు ఉంటాయి. ప్రసిద్ధిగాంచిన వ్యక్తులే నిర్ణయాలు తీసుకుంటారు. NABL సర్టిఫికెట్లతో వచ్చిన నెయ్యి ట్యాంకర్లకు TTD 3 రకాల పరీక్షలు చేస్తుంది. ఒక్క దానిలో ఫెయిలైనా ట్యాంకర్‌ను వెనక్కి పంపుతారు. ఇదంతా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే’ అని జగన్ చెప్పారు.
Similar News
News October 15, 2024
ABDUL KALAM: పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా
శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పుట్టినరోజు నేడు. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు ఆయన జీవన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన జన్మదినోత్సవాన్ని యూఎన్ఓ అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా వరించింది. కలాం ఎప్పుడూ చెప్పే ‘కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి’ అనే సందేశం ప్రతి ఒక్కరిలో ఆలోచన రగిలిస్తుంది.
News October 15, 2024
ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా మెండిస్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ నిలిచారు. సెప్టెంబర్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది. కాగా ఈ ఏడాది ఆయన రెండు సార్లు ఈ పురస్కారం అందుకున్నారు. గతంలో టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మాత్రమే ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు సార్లు ఈ అవార్డు దక్కించుకున్నారు. ఇప్పుడు మెండిస్ కూడా ఆయన సరసన చేరారు.
News October 15, 2024
ఆ కేసులను ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ చేయాలి: CM
AP: శ్రీసత్యసాయి(D) నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడళ్లపై సామూహిక <<14338493>>అత్యాచారం<<>> కేసును ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ఈ కేసు విచారణపై అధికారులతో సమీక్షించారు. గతంలో బాపట్లలో మహిళపై సామూహిక హత్యాచారం ఘటనపైనా ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలన్నారు. హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామన్నారు.