News October 18, 2024
CM రేవంత్ విజన్‌కు దోహదపడటం ఓ గౌరవం: అదానీ

యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ విషయంలో TG CM రేవంత్ రెడ్డి దార్శనికతకు, నాయకత్వానికి దోహదపడటాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నామని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. ‘మన యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాక మరింత సుసంపన్నమైన భారత్‌ను సృష్టించేందుకు అవసరమైన సామర్థ్యాల్ని మేం వెలికి తీస్తున్నాం. తరతరాలను ఉద్ధరించనున్నాం’ అని పేర్కొన్నారు. వర్సిటీ ఏర్పాటుకోసం ఆయన సీఎం రేవంత్‌కి రూ.100 కోట్ల చెక్కు అందించారు.
Similar News
News November 16, 2025
దిష్టిలో ఉన్న శాస్త్రీయత ఏమిటి..?

చిన్నపిల్లలు ఆహారం సరిగా తీనకపోయినా, విరేచనాలైనా దిష్టి తగిలిందని పెద్దలు అంటుంటారు. దిష్టి తీశాక పిల్లలు చలాకీగా ఆడుకుంటారు. దీని వెనకున్న సైన్స్ ఏంటంటే.. మన కళ్లకు సౌమ్యదృష్టి, క్రూర దృష్టి అనేవి ఉంటాయి. ఈ చూపుల ప్రభావంతో శరీరం నలతకు గురవుతుంది. ఉప్పు, మిరపకాయతో దిగదీయుట, వాటిని నిప్పులో వేయుట వలన వచ్చే పొగ ముక్కు ద్వారా పీల్చుకోవడం వలన నలత దూరమై, శరీరాన్ని తేలిక చేస్తుంది. <<-se>>#Scienceinbelief<<>>
News November 16, 2025
కర్మయోగి భారత్‌లో ఉద్యోగాలు

కర్మయోగి భారత్ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, B.COM, B.Sc, బీటెక్, BE, LLB, PG, M.Sc, ME, ఎంటెక్, MBA, PGDM, MCA ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: igotkarmayogi.gov.in
News November 16, 2025
రేపటి నుంచి స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంపులు

AP: రాష్ట్రంలోని స్కూళ్లలో రేపటి నుంచి ఈ నెల 26 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహించనుంది. 5-15 ఏళ్ల పిల్లలు వారి బయోమెట్రిక్, పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. విద్యార్థుల వెంట పేరెంట్స్ వారి ఆధార్ కార్డును తీసుకెళ్లాలి. కాగా రాష్ట్రంలో ఇప్పటికీ 15.46 లక్షల మంది పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.


