News February 5, 2025

జగన్ అంటున్నట్లు అది 2.O కాదు..పాయింట్ 5: సోమిరెడ్డి

image

AP: 2.O అంటూ <<15369361>>జగన్<<>> కొత్త నాటకం మొదలెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ‘జగన్ అంటున్నట్లు అది 2.O కాదు.. పాయింట్ 5. ఆయన కాళ్ల కింద వ్యవస్థలు నలిగిపోయాయి. ఐదేళ్లలో కార్యకర్తలను పట్టించుకోని జగన్ ఇప్పుడు వారి గురించి మాట్లాడటం వింతగా ఉంది. జగన్ ఎన్నో ప్యాలెస్‌లు కట్టించుకున్నారు. TDP సంగతి తర్వాత చూద్దువు.. ముందు మీ పార్టీ సంగతి చూడండి’ అని సోమిరెడ్డి హితవు పలికారు.

Similar News

News October 27, 2025

జగిత్యాల: రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఉత్తమ్

image

రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు తుఫాన్ ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పంట కొనుగోలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

News October 27, 2025

92 ఏళ్ల వయసులో దేశాధ్యక్షుడిగా ఎన్నిక

image

కామెరూన్ అధ్యక్షుడిగా పాల్ బియా(92) ఎనిమిదో సారి ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించారు. ఈనెల 12న జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు అక్కడి రాజ్యాంగ మండలి ఇవాళ ప్రకటించింది. సుమారు 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి 1982 నుంచి ప్రెసిడెంట్‌గా బియా కొనసాగుతుండటం గమనార్హం. మరోవైపు ప్రతిపక్షాల మద్దతుదారులు ఆందోళన చేపట్టగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల్లో నలుగురు చనిపోయారు.

News October 27, 2025

ఎస్‌బీఐలో మరో 3,500 పోస్టుల భర్తీ

image

నిరుద్యోగులకు SBI గుడ్‌న్యూస్ చెప్పింది. 3,500 PO పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గత జూన్‌లో 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించామని, ప్రస్తుతం 541 PO పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయని చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కిశోర్ కుమార్ పోలుదాసు చెప్పారు. ఈ FYలోనే మరో 3వేల సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. త్వరలో వీటికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని PTI ఇంటర్వ్యూలో తెలిపారు.