News February 5, 2025
జగన్ అంటున్నట్లు అది 2.O కాదు..పాయింట్ 5: సోమిరెడ్డి

AP: 2.O అంటూ <<15369361>>జగన్<<>> కొత్త నాటకం మొదలెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ‘జగన్ అంటున్నట్లు అది 2.O కాదు.. పాయింట్ 5. ఆయన కాళ్ల కింద వ్యవస్థలు నలిగిపోయాయి. ఐదేళ్లలో కార్యకర్తలను పట్టించుకోని జగన్ ఇప్పుడు వారి గురించి మాట్లాడటం వింతగా ఉంది. జగన్ ఎన్నో ప్యాలెస్‌లు కట్టించుకున్నారు. TDP సంగతి తర్వాత చూద్దువు.. ముందు మీ పార్టీ సంగతి చూడండి’ అని సోమిరెడ్డి హితవు పలికారు.
Similar News
News March 27, 2025
LPG ట్యాంకర్ల సమ్మె.. AP, TGలపై ప్రభావం

చమురు కంపెనీలు తెచ్చిన కొత్త కాంట్రాక్ట్ నిబంధనలతో నేటి నుంచి LPG ట్యాంకర్ ఓనర్స్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీనివల్ల ట్యాంకర్లలో అదనపు డ్రైవర్/క్లీనర్ లేకుంటే రూ.20వేలు జరిమానా విధిస్తారు. దీంతో ఇవాళ్టి నుంచి 4వేల ట్యాంకర్లు నిరవధిక సమ్మెలో పాల్గొంటాయి. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలలో గృహ, వాణిజ్య LPG సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
News March 27, 2025
ఫొగట్‌కు 3 ఛాయిస్‌లిచ్చిన హరియాణా ప్రభుత్వం!

భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ MLA వినేశ్ ఫొగట్‌కు క్రీడా విధానం కింద ఇచ్చే ప్రయోజనాలను హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆమె ఎమ్మెల్యే కావడంతో 3 ఛాయిస్‌లు ఇస్తున్నట్లు పేర్కొంది. రూ.4కోట్ల నగదు, హరియాణా షహ్రీ వికాస్ ప్రాధికార్ (HSVP) కింద ప్లాట్ లేదా గ్రూప్-A ఉద్యోగంలో ఏదైనా ఒకటి ఇస్తామంది. అయితే ఈ మూడింటిలో ఏది కావాలో చెప్పాలని కోరగా, ఆమె నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
News March 27, 2025
ఇంట్లో ఒకే బిడ్డ ఉంటే..!

తోబుట్టువులు లేకుండా పెరిగే పిల్లల్లో చాలా మంది ‘ఓన్లీ చైల్డ్ సిండ్రోమ్’ బారిన పడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారు సొంత అవసరాలు, కోరికలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో స్వార్థపరులుగా మారుతారు. ఇంట్లో ఒంటరితనాన్ని అనుభవించడంతో ఇతరులతో త్వరగా కలిసిపోలేరు. బాల్యమంతా ఏకాంతాన్ని అనుభవిస్తారు. షేరింగ్, అండర్‌స్టాడింగ్, సాల్వింగ్ వంటివి నేర్చుకోవడంలో వెనకబడతారు. పేరెంట్స్‌పై ఎక్కువ ఆధారపడతారు.