News October 17, 2024

తగ్గేదే లే అంటోన్న పంత్

image

పరిస్థితులు ఎలా ఉన్నా రిషభ్ పంత్ మాత్రం తన దూకుడు తగ్గదని మరోసారి నిరూపించారు. NZతో తొలి టెస్టులో భారత్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో పంత్ క్రీజులోకి వచ్చారు. బంతి స్వింగ్ అవుతుండటంతో తన ట్రేడ్‌మార్క్ షాట్‌కు ప్రయత్నించారు. పంత్ ధైర్యం చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం జైస్వాల్ (12*), పంత్ (13) నెమ్మదిగా కుదురుకుంటున్నారు.

Similar News

News October 17, 2024

46 పరుగులకే భారత్ ఆలౌట్

image

NZతో తొలి టెస్టులో టీమ్ ఇండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 46 పరుగులకే భారత్ ఆలౌటైంది. పంత్ (20), జైస్వాల్ (13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. విరాట్, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ డకౌట్ అయ్యారు. హెన్రీ 5, విలియం 4, సౌథీ ఒక వికెట్ తీశారు.

News October 17, 2024

సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన షూటర్ అరెస్ట్

image

యాక్టర్ సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో ముందడుగు పడింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ షూటర్లలో ఒకరైన సుఖ్ఖాను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారని IANS తెలిపింది. హరియాణా పోలీసుల సహకారంతో పానిపట్ సెక్టార్ 29లో అతడిని అధీనంలోకి తీసుకున్నారు. గురువారమే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సుఖ్ఖాది రైల్ కలాన్ విలేజ్. ఏప్రిల్‌లో బాంద్రాలోని సల్మాన్ ఇంటిపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరపడం తెలిసిందే.

News October 17, 2024

జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి: జగన్

image

AP: వైసీపీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, ముఖ్య నాయకులతో పార్టీ అధినేత జగన్ కీలక సమావేశం నిర్వహించారు. జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరుపై మానిటరింగ్ ఉంటుందని, కష్టపడిన వారికి ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండాలని సూచించారు. దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా వైసీపీని తయారుచేయాలన్నారు.