News October 17, 2024

తగ్గేదే లే అంటోన్న పంత్

image

పరిస్థితులు ఎలా ఉన్నా రిషభ్ పంత్ మాత్రం తన దూకుడు తగ్గదని మరోసారి నిరూపించారు. NZతో తొలి టెస్టులో భారత్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో పంత్ క్రీజులోకి వచ్చారు. బంతి స్వింగ్ అవుతుండటంతో తన ట్రేడ్‌మార్క్ షాట్‌కు ప్రయత్నించారు. పంత్ ధైర్యం చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం జైస్వాల్ (12*), పంత్ (13) నెమ్మదిగా కుదురుకుంటున్నారు.

Similar News

News November 4, 2024

పుష్ప-2 ట్రైలర్ వచ్చేది అప్పుడేనా?

image

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2’ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ మధ్యలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ట్రైలర్‌కు సంబంధించి డబ్బింగ్ పనులు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. పుష్ప-2 డిసెంబర్ 5న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే.

News November 4, 2024

నవంబర్ 4: చరిత్రలో ఈరోజు

image

* 1888: పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ జననం
* 1929: ప్రపంచ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం
* 1944: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ పుట్టినరోజు
* 1964: దర్శకుడు, నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాస రావు పుట్టినరోజు
* 1971: సినీనటి టబు పుట్టినరోజు(ఫొటోలో)

News November 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.