News February 18, 2025
ప్రజాస్వామ్యంపై జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది: లోకేశ్

AP: అధికారం ఉన్నప్పుడు చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం కోట్లాది మంది కళ్లారా చూశారని చెప్పారు. పచ్చి అబద్ధాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో జగన్ PhD చేసినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు జగన్ బ్రాండ్ అని ఫైరయ్యారు.
Similar News
News February 2, 2026
గ్రామీ వేడుకల్లో ఇండియన్ టచ్

ప్రపంచ సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ కెల్సియా బాలేరిని డిజైనర్ సబ్యసాచి చెవి రింగులు, ఉంగరం ధరించగా, సింగర్, సాంగ్ రైటర్ రాజా కుమారి సబ్యసాచి శారీని ధరించారు. భారతీయ, శ్రీలంక మూలాలు కలిగిన సింగర్ లారా రాజ్ ఓం లాకెట్‌తో పాటు పాపిడి బిళ్ల ధరించి మెరిసిపోయారు.
News February 2, 2026
లోక్‌సభ రేపటికి వాయిదా

లోక్‌సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో సభలో గందరగోళం నెలకొంది. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, వాస్తవాలు మాట్లాడితే తన గొంతు నొక్కుతున్నారని రాహుల్ విమర్శించారు. దీనిపై మోదీ, రాజ్‌నాథ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
News February 2, 2026
ఈ వారం థియేటర్&OTTల్లోకి రానున్న చిత్రాలివే..

ఈ వారం థియేటర్లలో ‘యుఫోరియా(డైరెక్టర్ గుణశేఖర్), ‘సుమతీ శతకం’, ‘శ్రీ చిదంబరం గారు’, ‘హనీ’, ‘ఆపరేషన్ పద్మ’, ‘లగ్గం టైం’, ‘విత్ లవ్’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి.
*అమెజాన్ ప్రైమ్-నారీ నారీ నడుమ మురారి (ఫిబ్రవరి 4), *జియో హాట్ స్టార్ – ది రాజా సాబ్ (ఫిబ్రవరి 4), *జీ5- పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ – ఫిబ్రవరి 7), * ఆహా – సైక్ సిద్ధార్థ (ఫిబ్రవరి 4), * సన్ నెక్స్ట్ – నీలకంఠ (ఫిబ్రవరి 6).


