News March 26, 2025

మంత్రివర్గ విస్తరణకు వేళాయే

image

APR 3న TG క్యాబినెట్ విస్తరణ జరగనుంది. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే వారికి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. రెడ్లలో రాజగోపాల్, సుదర్శన్, ఎస్సీల్లో వివేక్ పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అటు బీసీల్లో మాత్రం 2 పదవులకు ముగ్గురు పోటీ పడుతున్నారు. వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఖాయం కాగా మరో స్థానం కోసం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య రేసులో ఉన్నారు.

Similar News

News March 27, 2025

ఆ సీన్ కోసం 1000 సార్లు చూస్తారు: RC16 నిర్మాత

image

రామ్ చరణ్ ‘RC16’పై అభిమానుల్లో అంచనాలు పెంచేలా నిర్మాత రవిశంకర్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గ్లింప్స్ చూశానని, ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ప్రత్యేకంగా రూపొందించిన ఓ సన్నివేశం కోసమైనా ప్రేక్షకులు 1000 సార్లు చూస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రేపు ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.

News March 27, 2025

5 వైద్యశాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్‌లు

image

AP: ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని 5 ప్రభుత్వ వైద్య శాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్‌లు మంజూరయ్యాయి. వాటిలో రంగరాయ మెడికల్ కాలేజీ, రాయచోటి, చీరాల, పాలకొండ, భీమవరం ఏరియా ఆస్పత్రులున్నాయి. ఒక్కో యూనిట్‌కు రూ.23.75 కోట్ల చొప్పున మొత్తం రూ.118.75 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ఆస్పత్రుల్లో 50 బెడ్స్‌తో ఐసీయూ విభాగాలు ఏర్పాటవుతాయి.

News March 27, 2025

విశాఖలో లులూ మాల్.. భూమి కేటాయింపు

image

AP: విశాఖపట్నంలో లులూ గ్రూప్ నిర్మించబోయే షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో 13.43 ఎకరాలను APIICకి బదలాయించాలని VMRDAకు ఆదేశాలు జారీ చేసింది. 2017లోనే లులూకు భూమి కేటాయించగా 2023లో గత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ భూకేటాయింపులు చేయాలని APIICని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు.

error: Content is protected !!