News March 26, 2025
మంత్రివర్గ విస్తరణకు వేళాయే

APR 3న TG క్యాబినెట్ విస్తరణ జరగనుంది. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే వారికి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. రెడ్లలో రాజగోపాల్, సుదర్శన్, ఎస్సీల్లో వివేక్ పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అటు బీసీల్లో మాత్రం 2 పదవులకు ముగ్గురు పోటీ పడుతున్నారు. వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఖాయం కాగా మరో స్థానం కోసం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య రేసులో ఉన్నారు.
Similar News
News April 24, 2025
ఉగ్రదాడిలో హస్తం లేకపోతే పాక్‌కు ఎందుకు ఉలికిపాటు?: మాజీ క్రికెటర్

పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ పాత్రపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. ‘ఉగ్రదాడిలో నిజంగా పాకిస్థాన్ పాత్ర లేకపోయి ఉంటే ప్రధాని షెహబాజ్ ఇంకా ఎందుకు ఖండించలేదు? బలగాలెందుకు హై అలర్ట్‌లో ఉన్నాయి? ఎందుకంటే ఉగ్రవాదులకు నిలయంగా వారిని పెంచి పోషిస్తున్నామని పాక్‌కూ తెలుసు. సిగ్గు పడాలి’ అని ట్వీట్ చేశారు.
News April 24, 2025
9 ఏళ్ల తర్వాత వరుస హాఫ్ సెంచరీలు

ఈ ఐపీఎల్ తొలి నాలుగైదు మ్యాచ్‌లలో విఫలమైన రోహిత్ శర్మ ట్రాక్‌లోకి వచ్చారు. ఈ నెల 20న CSKపై 76*, నిన్న SRHపై 70 రన్స్ చేశారు. ఇలా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేయడం 9 ఏళ్లలో తొలిసారి. చివరిసారిగా 2016లో 62, 65, 68*, 85* రన్స్ చేశారు. అంతకుముందు 2008లో 76*, 57, 2010లో 51, 68*, 2011లో 87, 56*, 2013లో 74*, 62* బ్యాక్ టు బ్యాక్ అర్ధ శతకాలు బాదారు.
News April 24, 2025
టెన్త్ ఫెయిలైన వారికి ALERT

AP: టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1,000గా ఉంది. https://www.bse.ap.gov.in/ సైట్‌లో HM లాగిన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.