News February 14, 2025

WPL-2025కు వేళాయె.. నేడే తొలి మ్యాచ్

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2025 ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. నేడు తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. వడోదర వేదికగా రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. 5 జట్లు పాల్గొనే ఈ టీ20 లీగ్ 2023లో ప్రారంభమైంది. తొలి సీజన్‌లో ముంబై ఇండియన్స్, రెండో సీజన్‌లో RCB విజేతలుగా నిలిచాయి.

Similar News

News March 21, 2025

నిమిషానికి ప్రభుత్వ అప్పు రూ.కోటి: ఏలేటి

image

TG: రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై ₹2.27L రుణభారం ఉందని BJP శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. TG అప్పు ₹8.6L Crకు చేరిందని ఆరోపించారు. ప్రభుత్వం నిమిషానికి ₹కోటి అప్పు చేస్తోందని, ఇలా రుణాలు పెరిగితే అభివృద్ధి ఎలా సాధ్యమని బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. UPA హయాంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 32% ఉంటే ఇప్పుడు 42% అందుతోందని, అయినా కేంద్రాన్ని విమర్శించడం సరికాదన్నారు.

News March 21, 2025

కివీస్‌పై పాకిస్థాన్ స్టన్నింగ్ విన్

image

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ అద్భుత విజయం సాధించింది. 205 పరుగుల టార్గెట్‌ను ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 200కుపైగా టార్గెట్‌ను అత్యంత వేగంగా ఛేదించడం ఇదే తొలిసారి. ఆ జట్టు ఓపెనర్ హసన్ నవాజ్ (105*) సెంచరీతో విధ్వంసం సృష్టించారు. 45 బంతుల్లోనే 10 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకం బాదారు. కెప్టెన్ సల్మాన్ అఘా (51*) హాఫ్ సెంచరీతో రాణించారు.

News March 21, 2025

శ్రీశైలం ఘాట్‌రోడ్డులో నిలిచిన లారీ.. 5KMల ట్రాఫిక్ జామ్

image

AP: శ్రీశైలం ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఇసుక లారీ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తుమ్మలబైలు నుంచి శ్రీశైలం వరకు 5 కి.మీ మేర బస్సులు, కార్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు.

error: Content is protected !!