News December 7, 2024

ఆటోల బంద్‌పై వెనక్కి తగ్గిన JAC

image

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఆటోల బంద్‌కు పిలుపునిచ్చిన JAC దానిని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన వెంటనే తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపింది. మహిళలకు ఉచిత బస్సు పథకంతో తమ గిరాకీ పోయి, ఉపాధి దెబ్బతిందని JAC నేతలు తొలుత ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చారు. తమకు ప్రభుత్వం ఏటా రూ.15వేలు చెల్లించాలని కోరుతున్నారు.

Similar News

News January 17, 2025

రాత్రి భోజనం చేయకపోతే…

image

బరువు తగ్గుతామని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. నైట్ భోజనం చేయకపోతే మధ్యరాత్రి ఆకలివేసి నిద్రకు భంగం కలుగుతుంది. ఎసిడిటీ, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. మరుసటి రోజంతా నీరసంగా ఉంటుంది. బద్దకం, చికాకు పెరుగుతుంది. ఉదయం లేవగానే బాగా ఆకలేసి ఎక్కువ తింటారు. ఇది బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి తప్పకుండా భోజనం చేయాలి. అయితే రోస్టెడ్‌తో పాటు ఫాస్ట్‌ఫుడ్‌ వంటివి తినకూడదు.

News January 17, 2025

పదిహేనేళ్లలో రూ.5400 నుంచి రూ.4లక్షలు

image

డిగ్రీలున్నా ఉద్యోగాలు రాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు తక్కువ శాలరీ అని వచ్చినదాన్ని వద్దనుకుంటారు. అలా కష్టపడినవారికి ఎక్స్‌పీరియన్స్ తోడైతే విజయాన్ని ఎంజాయ్ చేయొచ్చనే విషయాన్ని గుర్తించరు. అలాంటి వారికి కళ్లు తెరిపించే ఓ ఉదాహరణ నెట్టింట వైరలవుతోంది. ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి 2008లో నెలకు రూ.5400 జీతం వచ్చే ఉద్యోగాన్ని నిలబెట్టుకొని ఇప్పుడు ఏడాదికి రూ.50లక్షలు సంపాదిస్తున్నారు.

News January 17, 2025

రేపు మధ్యాహ్నం రోహిత్ శర్మ ప్రెస్ మీట్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ రేపు మ.12.30 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ముంబై వాంఖడే స్టేడియం వద్ద చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్‌ను ప్రకటిస్తారు. అలాగే కొన్ని రోజులుగా డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలంటూ వస్తున్న వార్తలపై స్పందించే అవకాశం ఉంది. కోచ్ గంభీర్ పాల్గొనే విషయంపై క్లారిటీ లేదు. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్.