News January 21, 2025
జాక్ పాట్.. రూ.10 కోట్ల లాటరీ గెలిచిన లారీ డ్రైవర్

పంజాబ్‌కు చెందిన లారీ డ్రైవర్ జాక్ పాట్ కొట్టాడు. పంజాబ్ స్టేట్ డియర్ లోహ్రీ మకర్ సంక్రాంతి బంపర్-2025లో రూప్ నగర్ జిల్లాకు చెందిన హర్పిందర్ సింగ్ రూ.10 కోట్లు గెలుచుకున్నాడు. ఇప్పటివరకు అందించిన అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనీ ఇదేకావడం విశేషం. సింగ్ కువైట్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెలవులపై తిరిగొచ్చి రూ.500 పెట్టి లాటరీ టికెట్ కొని కోటీశ్వరుడయ్యాడు. గత 15 ఏళ్లుగా అతను లాటరీలు కొంటున్నాడు.
Similar News
News April 18, 2026
రైతుభరోసా రెండో విడత.. ఎల్లుండి ఖాతాల్లోకి డబ్బులు

TG: రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతలో 1-5 ఎకరాల్లోపు భూమి ఉన్న 45.11 లక్షల మంది రైతులకు రూ.5,653 కోట్లు జమ అవుతాయని వ్యవసాయశాఖ తెలిపింది. కాగా గత నెల 23న తొలి విడత కింద ఎకరం లోపు ఉన్న 68 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు జమ చేసింది.
News April 18, 2026
ఏపీలో ప్రతిపక్షమేది?

ఏపీలో ఉన్న మూడు పెద్ద ప్రాంతీయ పార్టీలు టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తు పెట్టుకోగా.. జగన్ పొత్తు లేకపోయినా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ BJPకి వ్యతిరేకంగా ఉన్నా దానికి పెద్దగా ప్రజల మద్దతు దక్కడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సౌత్ రాష్ట్రాలన్నీ ఒక దారిలో ఉంటే ఏపీది మరో దారి. మరి ఏపీలో ప్రతిపక్షమేది?
News April 18, 2026
డీలిమిటేషన్.. జాతీయ మీడియాలో రేవంత్ పేరు!

131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లుల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు జాతీయ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మిగతా సీఎంల కంటే ముందుగా రేవంతే ఈ అంశాన్ని లేవనెత్తారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్‌కు అన్యాయం జరుగుతుందని కేంద్రాన్ని విమర్శించారు. హైబ్రిడ్ మోడల్‌లో డీలిమిటేషన్ జరగాలని సరికొత్త పాయింట్‌ను తెరపైకి తెచ్చారు.


