News March 11, 2025
జగన్ రూ.కోటి సాయం అందలేదు: పార్థసారథి

AP: విజయవాడ వరద బాధితులకు సాయంపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ రూ.కోటి ఇచ్చారని బొత్స తెలపగా మంత్రి పార్థసారథి స్పందించారు. ప్రభుత్వానికి జగన్ ఇచ్చిన విరాళం అందలేదన్నారు. అలాగే, సాక్షి పేపర్ కొనుగోలుకు ప్రభుత్వం వాలంటీర్లకు నెలకు రూ.200 ఇచ్చిందని, అక్రమంగా చేసిన చెల్లింపులపై విచారణ చేయిస్తామన్నారు. అక్రమాలు చేసిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News March 26, 2025
రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం

రష్యా, ఉక్రెయిన్ కీలక ఒప్పందానికి వచ్చాయి. చమురు కర్మాగారాలు, రిఫైనరీలు, విద్యుత్ ప్లాంట్లు తదితర ఇంధన ఉత్పత్తి ప్రాంతాలపై దాడి చేసుకోరాదని అంగీకరించాయి. ఓ ప్రకటనలో రష్యా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది 30 రోజుల కోసం చేసుకున్న తాత్కాలిక ఒప్పందమేనని, పరస్పర అంగీకారంతో మరింత పొడిగించేందుకు అవకాశం ఉందని పేర్కొంది. రెండు దేశాల్లో ఎవరు ఈ అంగీకారాన్ని ఉల్లంఘించినా ఒప్పందం రద్దవుతుందని వివరించింది.
News March 26, 2025
జాగ్రత్త.. ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. !

ఉదయాన్నే నిద్ర లేవగానే చాలా నీరసం, కళ్లు తిరిగినట్లు అనిపించడం, రాత్రంతా పలుమార్లు మూత్రవిసర్జనకోసం లేవాల్సి రావడం, నాలుక-పెదాలు మాట్లాడలేనంతగా తడారిపోవడం, టైమ్‌కి తినకపోతే శరీరం వణుకు రావడం.. ఇవన్నీ షుగర్ లక్షణాలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
News March 26, 2025
భారతీయులకు బంపరాఫర్.. విమాన టికెట్లపై 30 శాతం డిస్కౌంట్

యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయుల కోసం బంపరాఫర్ ప్రకటించింది. సమ్మర్‌లో తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే ఇండియన్స్‌కు 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రాన్స్, టర్కీ, స్పెయిన్, ప్రాగ్, గ్రీస్, వార్సా రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ నెల 28లోగా బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించవచ్చని వెల్లడించింది.