News February 10, 2025
జగన్కు ప్రతిపక్ష నేత హోదా లేదు: రఘురామకృష్ణరాజు

AP: అసెంబ్లీలో సీఎం చంద్రబాబుకు ఇచ్చే సమయమే తనకూ ఇవ్వాలని జగన్ కోరడం సరికాదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా లేదని, అసెంబ్లీ నియమాలు, నిబంధనలను తెలుసుకోవాలని సూచించారు. అనుమతి తీసుకోకుండా 60 రోజులు శాసనసభకు రాకపోతే వారి సభ్యత్వం రద్దు చేయొచ్చని పునరుద్ఘాటించారు. ఈ మేరకు రాజ్యాంగంలో రూల్స్ ఉన్నాయని తెలిపారు.
Similar News
News November 27, 2025
ఆ సమయంలో ఎంతో బాధపడ్డా: మంచు లక్ష్మి

నటి మంచు లక్ష్మి తన కుటుంబంలో జరిగిన విభేదాలపై తొలిసారి స్పందించారు. దేవుడు వరం ఇస్తే కుటుంబం మళ్లీ సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటానని తెలిపారు. భారతీయ కుటుంబాల్లో గొడవలు సహజమని, కానీ చివరికి అందరూ ఒక్కటిగా ఉండటం ముఖ్యమన్నారు. గొడవల గురించి తాను బాధపడలేదన్న వార్తలు తప్పు అని, ఆ సమయంలో తీవ్రమైన మానసిక వేదన అనుభవించినప్పటికీ బయటపెట్టలేదని తెలిపారు. వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టపడనని అన్నారు.
News November 27, 2025
లోకేశ్ విమాన ప్రయాణాలపై TDP క్లారిటీ.. YCP కౌంటర్

AP: మంత్రి లోకేశ్ విమాన ప్రయాణాలకు ప్రభుత్వ డబ్బులు వాడారన్న విమర్శలపై ఆర్టీఐ వివరాలతో TDP క్లారిటీ ఇచ్చింది. 77 సార్లు ప్రత్యేకంగా విమానాల్లో ప్రయాణించినా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదని పేర్కొంది. ప్రయాణాలన్నింటికీ లోకేశ్ సొంత సొమ్ము వెచ్చించినట్లు సంబంధిత వివరాలను షేర్ చేసింది. అదే నిజమైతే బ్యాంక్ స్టేట్మెంట్ను బయట పెట్టాలంటూ YCP కౌంటర్ ఇచ్చింది.
News November 27, 2025
ఇతిహాసాలు క్విజ్ – 79 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?
సమాధానం: శివ భక్తులైన మూడు జీవులు శివుడి కోసం తమ ప్రాణాలను అర్పించి మోక్షం పొందాయి. అవే.. శ్రీ (సాలెపురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు). ఈ 3 జీవులు శివుడిని అత్యంత భక్తితో పూజించి, స్వామి అనుగ్రహం పొంది అక్కడే లీనమయ్యాయి. వీటి పేర్ల కలయికతోనే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు స్థిరపడింది.
<<-se>>#Ithihasaluquiz<<>>


