News February 10, 2025

జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా లేదు: రఘురామకృష్ణరాజు

image

AP: అసెంబ్లీలో సీఎం చంద్రబాబుకు ఇచ్చే సమయమే తనకూ ఇవ్వాలని జగన్ కోరడం సరికాదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా లేదని, అసెంబ్లీ నియమాలు, నిబంధనలను తెలుసుకోవాలని సూచించారు. అనుమతి తీసుకోకుండా 60 రోజులు శాసనసభకు రాకపోతే వారి సభ్యత్వం రద్దు చేయొచ్చని పునరుద్ఘాటించారు. ఈ మేరకు రాజ్యాంగంలో రూల్స్ ఉన్నాయని తెలిపారు.

Similar News

News March 21, 2025

తులసి మెుక్క ఇంట్లో ఉంటే కలిగే లాభాలివే..!

image

హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మెుక్కను లక్ష్మీదేవీ స్వరూపంగా భావిస్తారు. దోమలు, కీటకాలు వంటివి ఇంట్లోకి రాకుండా రక్షణ కల్పిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఉంటే పాజిటివ్ ఎనర్జీ. తులసి ఆకుల్ని నమిలితే జలుబు, దగ్గు వంటి వ్యాధులకు ఉపశమనం లభించడంతో పాటు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి, తద్వారా మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. వీటి వాసన పీల్చుకుంటే ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది.

News March 21, 2025

మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ అభినందనలు

image

TG: UKలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని CM రేవంత్ అభినందించారు. ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు చిరంజీవిగారికి హృదయపూర్వక అభినందనలు. మీకు లభించిన ఈ గౌరవం తెలుగుజాతికి గర్వకారణం. భవిష్యత్తులో మీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్ఠలను విశ్వవేదికపై చాటిచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

News March 21, 2025

ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258కోట్లు

image

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చును కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ప్రధాని పర్యటనల ఖర్చును తెలపాలని కోరగా విదేశాంగ శాఖ బదులిచ్చింది. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు చేయగా రూ. 258కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. 2023 జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనకు అధికంగా రూ.22కోట్లు ఖర్చు జరిగినట్లు తెలిపింది.

error: Content is protected !!