News July 18, 2024
సచివాలయం అంటే ఏంటో కూడా జగన్‌కు తెలియదు: మంత్రి ఆనం
AP: మాజీ సీఎం జగన్‌కు సచివాలయం అంటే ఏంటో కూడా తెలియదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. తన అనుయాయులకు వేల ఎకరాలు కట్టబెట్టి రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ‘వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేసింది. విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా రూ.వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం నిలిచిపోయిన రాజధాని అమరావతి, పోలవరం పనులు మళ్లీ మొదలుపెడుతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 13, 2024
ఘోరం: నిద్రలేపిందని తల్లిని చంపేసిన బాలుడు!
కాలేజీకి వెళ్లమంటూ నిద్రలేపిన తల్లిని ఇంటర్ చదువుతున్న బాలుడు ఆగ్రహంతో తోసేశాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై మృతిచెందారు. UPలోని గోరఖ్‌పూర్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హత్య అనంతరం ఇంటికి తాళం వేసి నిందితుడు పరారయ్యాడు. చెన్నైలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న అతడి తండ్రి భార్య ఫోన్ తీయడం లేదని ఇంటికి వచ్చి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. పోలీసుల విచారణలో కొడుకే నిందితుడని తేలింది.
News December 13, 2024
మార్చి 3 నుంచి TG ఇంటర్ పరీక్షలు?
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై బోర్డు కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 3 నుంచి ప్రారంభించాలని భావిస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో ప్రాక్టికల్స్ నిర్వహించాలని చూస్తోంది. త్వరలోనే ఇంటర్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ షెడ్యూల్ ప్రకటించనుంది. మరోవైపు ఇప్పటికే ఏపీలో <<14851951>>ఇంటర్<<>>, <<14851568>>టెన్త్<<>> షెడ్యూల్ విడుదలైంది.
News December 13, 2024
క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు
మీడియాపై దాడి ఘటనలో నటుడు మోహన్ బాబు TV9కి లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. ‘నా కుటుంబ ఘటన ఇలా పెద్దదిగా మారి టీవీ9ను, జర్నలిస్టులను ఆవేదనకు గురిచేసినందుకు చింతిస్తున్నాను. ఘటన అనంతరం 48 గంటల పాటు ఆస్పత్రిపాలు కావడం వల్ల వెంటనే స్పందించలేకపోయాను. ఆ రోజు ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడటం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, టీవీ9కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను’ అని పేర్కొన్నారు.