News November 15, 2024
జగన్ ఆర్థిక ఉగ్రవాది: మంత్రి పయ్యావుల
AP: ఐదేళ్ల పాలలో జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, ఆయనొక ఆర్థిక ఉగ్రవాది అని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో విమర్శించారు. రాష్ట్ర సంపద పెంచకుండా విపరీతంగా అప్పులు చేశారని దుయ్యబట్టారు. ‘బిల్లులను పెండింగ్‌లో పెట్టడంతో అనేకమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టారు. పోలవరం పనులు నిలిపేసి డయాఫ్రంవాల్ డ్యామేజీకి జగన్ కారణమయ్యారు’ అని ఆరోపించారు.
Similar News
News December 5, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 5, 2024
వ్యవసాయదారులకు మరిన్ని రుణాలు: నాబార్డ్
AP: రాష్ట్రంలో వ్యవసాయానికి మరిన్ని రుణాలు అందించేందుకు తమ సహకారం ఉంటుందని నాబార్డు ఛైర్మన్ షాజీ కృష్ణన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అమరావతిలో CM చంద్రబాబుతో కృష్ణన్ సమావేశమయ్యారు. ‘డ్వాక్రా గ్రూపులు, రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రయత్నిస్తాం. రాష్ట్రానికి FIDF కింద అదనపు నిధులు, కేటాయింపులు, రాయితీలు అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
News December 5, 2024
ఈ రోజు నమాజ్ వేళలు
తేది: డిసెంబర్ 05, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 5:16 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:33 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:07 గంటలకు
అసర్: సాయంత్రం 4:05 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:41 గంటలకు
ఇష: రాత్రి 6.58 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.